Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మార్గావో » ఆకర్షణలు » దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు, మార్గావో

8

దూద్ సాగర్ జలపాతాలు – ఈ ఆకట్టుకునే జలపాతం పేరుకి అనువాదం ‘పాల సముద్రం’, ఇది సముచితమైన పేరు, నీళ్ళలాగా కాకుండా పాల వాలే కనిపించే ఈ జలపాతం రాళ్ళ కింద ఉదృతంగా ప్రవహిస్తుంది. పానాజీ నుండి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక-గోవా సరిహద్దు మధ్య ఉన్న ఈ జలపాతం చాలా అందమైన ప్రదేశం, ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ.

దుడ్ సాగర్ జలపాతాలు

దీనికి సంబంధించిన పురాణం

పురాణాల ప్రకారం, దుడ్ సాగర్ సమీపంలోని ఒక ఆవిలోని రాజభవనంలో అందమైన యువరాణి నివసించేదని చెప్తారు, ఆమె దీనికి సమీపంలో ఉన్న సరస్సులో స్నానం చేసేది, స్నానం చేసిన తరువాత ఆమె తన బంగారపు జగ్గులో తియ్యటి పాలు తాగేది. అదేసమయంలో, ఒక యువరాజు ఆమె స్నానం చేస్తున్నపుడు చూస్తున్నట్లు గమనించి ఇబ్బంది పడింది, తనను చూడకుండా అతనిని నిరోధించింది, ఆమె అతని దృష్టిని నిరోధించడానికి జగ్గు నుండి పరిశుభ్రమైన పాలతో ఒక తెరను ఏర్పాటుచేసింది. అవే తియ్యని పాలు దుడ్ సాగర్ జలపాతాల వలె ఈరోజుకీ ఈ రాళ్ళ కింద ప్రవహిస్తున్నట్లు చెప్తారు.

జలపాతం, దాని పరిసరాలు

దుడ్ సాగర్ జలపాతాలు, రోడ్ల పరిసరాలు గోవా అటవీ శాఖ వారిచే నిర్వహించబడతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా పేర్కొనబడింది, ఇది భారతదేశంలోని ఐదవ అతిపొడవైన జలపాతం, దీని మొత్తం ఎత్తు 310 మీటర్లు. ఇది ప్రత్యేకంగా వర్షాకాల సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, వర్షాకాలంలో రహదారులు నీటితో మూసుకుపోతాయి, అక్టోబర్ తరువాత మాత్రమే ప్రజా రవాణాకు అనువుగా ఉంటుంది. ఒక కొలనుగా తయారైన ఈ ప్రవహించే నీరు ప్రజలు వారి స్వంత పూచీకత్తుతో స్నానాలు ఆచరించవచ్చు. ఈ జలపాతాలు సౌత్ గోవా లోని కొల్లెం లో భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉంది, ఇది వివిధ రకాల జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులకు నిలయమైన ఈ అడవి దట్టమైన ఆకురాల్పులతో చుట్టబడి ఉంది.

కొల్లెం సమీప రైల్వే స్టేషన్ కావడం వల్ల, దుడ్ సాగర్ జలపాతాలను రోడ్డు, రైలు మార్గాల ద్వారా తేలికగా చేరుకోవచ్చు. కర్ణాటక నుండి ఈ జలపాతాలను చేరుకోవడానికి రైలు మార్గాలు: హుబ్లి, ధార్వాడ్, అల్నావార్, లోండా, తినైఘాట్, కాసిల్ రాక్, దుడ్ సాగర్. ఈ రహదారి అడవి మార్గం కావడం వల్ల, దుడ్ సాగర్ కి కార్లో ప్రయాణించడం సూచనప్రాయం కాదు, అనేక ప్రదేశాల వద్ద నదులు రహదారులను దాటుతూ ఉంటాయి.

దుడ్ సాగర్ వద్ద పర్వతారోహణ కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పర్వహతా రోహాకులు విశ్రాంతి తీసుకునే ఆశ్రాయలు ఉన్న ఈ జలపాతానికి సమీపంలో ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. అయితే, ముందుగా వచ్చిన పర్వతారోహకులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed

Near by City