ఆలయ పట్టణం మైలదుత్తురైలో బయటి తిరిగి చూడవలసినవి అనేకం ఉంటాయి. వేసవి చెమటతో, వేడితో పర్యటనకు అనువుగా ఉండని కాలం. మైలదుత్తురై సందర్శనకు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలతో, ఎండ, నీడల మేలు కలయికతో శీతాకాలం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. చాలామంది భక్తులు చెప్పులు లేకుండా ఆలయాలను సందర్శించినందున, శీతాకాలం చల్లటి ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి.
వేసవికాలం మైలదుత్తురైలో వేసవి తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లాగే వేడిగా, జిడ్డుగా ఉంటుంది. వేసవి మార్చి, మే నెలల మధ్యలో ఉంటుంది. ఉష్ణోగ్రత సాధారణంగా 43-25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. రాత్రిళ్ళు చల్లగా ఉండగా, పగటి వేళల్లో మరీ ప్రత్యేకంగా మధ్యాహ్నాలు భరించలేని వేడితో ఉంటాయి. వేడి గరిష్టంగా ఉండే ఏప్రిల్, మే నెలలలో దూరంగా ఉండటం మంచిది.
వర్షాకాలం వర్షాకాలం, చెమటలు పట్టించే వేడి నుండి కొంత ఉపసమనాన్ని కల్గిస్తూ మార్పుకు స్వాగతం పలుకుతుంది. మైలదుత్తురైలో వర్షాకాలం జూన్, సెప్టెంబర్ మధ్య ఉంటుంది, పెద్దగా ఇబ్బంది కలగని కొద్దిపాటి జల్లులు కురుస్తాయి. మైలదుత్తురైలోని పురాతన ఆలయాలు వర్షాలకు మెరుపును సంతరిచుకొంటాయి. వర్షాకాలంలో ప్రతిదీ ఎంతో శుభ్రంగా, జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
శీతాకాలం డిసెంబర్, జనవరిలలో ఉండే శీతాకాలం ఆహ్లాదకర౦గా, ఆహ్వానం పలుకుతుంటుంది. 32, 18 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రతతో శీతాకాలం మైలదుత్తురై సందర్శనకు అనువుగా ఉంటుంది. శీతాకాలంలో కూడా మధ్యాహ్నాలు వేడిగా ఉండటమే కాక, తూర్పు తీర ప్రాంతంలో ఉన్నందున ప్రధాన భూభాగంతో పోల్చుకొంటే వెచ్చగా ఉంటుంది.