Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మయూరభంజ్ » వాతావరణం

మయూరభంజ్ వాతావరణం

మయూర్భంజ్ వాతావరణంశీతాకాలంలో మయూర్భంజ్ ని సందర్శించడం ఉత్తమం. శీతాకాలం సరైన సూర్యరశ్మి, తేమ, వర్షపాత సమ్మేళనాన్ని కలిగిఉంది. సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉంటుంది. 15 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద డిసెంబర్, జనవరి మాసాలు చల్లగా ఉంటాయి. శీతాకాలం అక్టోబర్ చివరి నుండి ఫిబ్రవరి ప్రారంభం వరకు ఉంటుంది.

వేసవి

వేసవి మయూర్భంజ్ లో వేసవి విదేశీయుల “గ్రేట్ ఇండియన్ సమ్మర్” అని అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. వేడి, పొడి వాతావరణం ఒర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలతో సంవత్సరంలో ఏప్రిల్, మే మాసాలు ఎక్కువ వేడిగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం మయూర్భంజ్ లో మూడు కాలాలలో వర్షాకాలం అతి ఎక్కువ సమయం మే చివరి నుండి అక్టోబర్ ప్రారంభం వరకు ఉంటుంది. అయితే ఆగస్ట్ లో అధిక వర్షపాతం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, 30 డిగ్రీలుగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం మయూర్భంజ్ లో శీతాకాలం ఉత్తమ ప్రదేశాలను, శబ్దాలను అందిస్తుంది. ఇక్కడ ఈ సమయంలో ఆనందంగా ఉండడానికి దీవాలి, నవరాత్రి పండుగలు కూడా జరుపుకుంటారు. వర్షపాతం తక్కువగా ఉండే శీతాకాలంలో సిమిలిపల్ నేషనల్ పార్కు లోని వన్యప్రాణులు చూడడానికి బాగుంటాయి.