నాభ సాహిబ్, పటియాల-జిరక్పూర్ జాతీయరహదారిపై మొహాలి జిల్లలో ఉన్న ఒక పేరుగాంచిన సిక్కు మందిరం. గురు తేజ్ బహదూర్ జి ని ఉరితీసిన తరువాత, ఆనందపూర్ సాహిబ్ వద్ద ఉన్న దహన స్థలం నుండి ఆయన మర్త్య అవశేషాలు భాయి జైతా చే గ్రహించబడ్డాయని చెప్తారు. ఒక ముస్లిం సాధువు, గురు సాహిబ్ శిష్యుడు అయిన ఫకీర్ దర్గాహి షాహ్ అభ్యర్ధనతో, మిగిలిన అవశేషాలు ఈ గురుద్వారా వద్ద ఉంచబడ్డాయి. ఈ గురుద్వారా ఆనుకుని ముస్లిం మత ఫకీరు మఝార్ ఉంది.
గురు గోవింద్ సింగ్ జి, అతని తండ్రి గురు తేజ్ బహదూర్ జి గౌరవార్ధం భంగని యుద్ధం తరువాత 1688 లో నాభ సాహిబ్ ని సందర్శించాడు. బంద సింగ్ బహదూర్ కూడా ముస్లిం ఫకీరు గురు సాహిబ్ గౌరవార్ధం 1709 లో ఈ మందిరాన్ని సందర్శించాడు. 1695 నాటి, మొహాలి లోని ఈ గురుద్వారాను ప్రతి సంవత్సరం అనేక సిక్కు భక్తులు తప్పక సందర్శించేవారు.



Click it and Unblock the Notifications