Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సంగ్రూర్

సంగ్రూర్ - గురుద్వారాల నగరం!

13

సంగ్రూర్, పంజాబ్ లోని ఒక అందమైన నగరం. సంఘు అనే ఒక జాట్ వ్యక్తీ పేరిట 400 ఏళ్ల నాడు ఏర్పడింది ఈ వూరు. పాటియాలా నుంచి 48 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం ఒకప్పటి జింద్ రాష్ట్రానికి రాజధానిగా వుండేది. సంగ్రూర్ పర్యాటకాన్ని సుప్రసిద్ధం చేసే 20 కి పైగా గురుద్వారాలు వుండే ఈ నగరాన్ని గురుద్వారాల నగరం గా పిలుస్తారు. ఇక్కడి సాంస్కృతిక సౌరభం వల్ల వివిధ దేశాల పర్యాటకులు విరివిగా వస్తారు.

సంగ్రూర్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

శీష్ మహల్, బనసర్ ఉద్యానవనం, గురుద్వారా జనమ్, గురుద్వారా నానక్ ఝిరా సాహెబ్, గురుద్వారా అకోయి సాహిబ్, లాంటివి సంగ్రూర్ పర్యాతకంలో తప్పని సరిగా వుండే ఆకర్షణలు. ఈ గురుద్వారాల్లో సిఖ్ గురువులు కూడా వుంటారు. వివిధ ప్రాంతాల ప్రజలను ఆకర్షించేలా సంగ్రూర్ లో చాలా ఉత్సవాలు నిర్వహిస్తారు. జన్మాష్టమిని చాలా వేడుకగా ఇక్కడ జరుపుకుంటారు.

ప్రతి ఏటా నిర్వహించే గూగ నవమి అనే ఉత్సవానికి దేశం నలు మూలల నుంచి ప్రజలు వచ్చి పాల్గొంటారు. జనవరి నెలలో నిర్వహించే కుకా ఉత్సవం సంగ్రూర్ పర్యాటకం లోని ఉత్సాహాన్ని చూడాలనుకునే పర్యాటకులు మిస్ కాకూడదు. దాంతో పాటు పర్యాటకులు జామా మసీద్ (మలేర్ కోట్లా), ఇలా ముబారక్ (భటిండా), సన్ సెట్ పాయింట్ (కసౌలీ)మ్ కాళీ దేవాలయం (పాటియాలా), వారాంతాల్లో చూడవచ్చు.

సంగ్రూర్ ఎలా చేరుకోవాలి

పంజాబ్ లోని ప్రధాన నగరాలనుంచి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం అయి వుండడం వల్ల ఈ నగరానికి ప్రయాణించడం చాలా తేలిక. జబల్పూర్ ఎక్స్ప్రెస్, అమ్రితసర్ ఎక్స్ప్రెస్స్, పంజాబ్ మెయిల్ లాంటి ప్రధానమైన రైళ్ళు సంగ్రూర్ రైల్వే స్టేషన్ గుండా వెళ్తాయి.

రోజంతా ఆటో రిక్షాల్లాంటి ప్రజా రవాణా సాధనాలు నగరం అంతటా దొరుకుతాయి. పైగా సమీపంలోని చండీఘర్ విమానాశ్రయానికి విమానంలో వెళ్లి అక్కడినుంచి ఒక టాక్సీ లేదా కాబ్ మాట్లాడుకుని సంగ్రూర్ వెళ్ళవచ్చు.

సంగ్రూర్ వాతావరణం

వేసవి చాలా వేడిగా, పొడిగా వుండగా శీతాకాలాలు చాలా చల్లగా, ఆహ్లాదకరంగా వుంటాయి. వర్షాకాలం చాలా కొద్ది కాలం మాత్రమె వుంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా వుండే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమం, అదే సమయంలో చాలా ఉత్సవాలు నిర్వహిస్తారు.

 

సంగ్రూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సంగ్రూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సంగ్రూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సంగ్రూర్

  • రోడ్డు ప్రయాణం
    రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు సంగ్రూర్ రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానం అయి వుండడం వల్ల ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం ఉత్తమం. న్యూ డిల్లీ నుంచి (ఎన్ హెచ్ 10) నాలుగు గంటల 18 నిమిషాల్లో 256 కిలోమీటర్ల దూరంలో వున్న సంగ్రూర్ కి చేరుకోవచ్చు. పాటియాలా (56 కిలోమీటర్లు), లూధియానా (77కిలోమీటర్లు), చండీఘర్ (125 కిలోమీటర్లు) లాంటి పంజాబ్ లోని ఇతర నగరాలకు కాబ్ లు, బస్సులు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    సంగ్రూర్ లో నగరం మధ్యలో రైల్వే స్టేషన్ ఉంది. జబల్పూర్, అమ్రితసర్ ఎక్స్ప్రెస్స్, అండమాన్, పంజాబ్ మెయిల్ లాంటి ప్రధానమైన రైళ్ళు ఈ స్టేషన్ గుండా నడుస్తాయి. రాజధాని న్యూడిల్లీ కి నిత్యం ఈ స్టేషన్ నుంచి రైళ్ళు తిరుగుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in సంగ్రూర్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue