Search
  • Follow NativePlanet
Share

మనసా - ప్రశాంత పర్యటనకు ఒక చిన్న ప్రదేశం !

8

'తెలుపు బంగారం కల ప్రదేశం' గా పిలువబడే మానస పంజాబ్ లో బర్నాలా-సర్డుల్ఘర్-సిర్సా రోడ్ పై కలదు. ఈ ప్రదేశం మొదట్లో ఫూల్కియా సిఖ్ వంసస్తులకు చెందినది.(1722-1948). తర్వాత అది కైతాల్ సిఖ్ రాజ్యంలో భాగం అయ్యింది. ఈ ప్రాంతం మూలాలు ఇండస్ వాలీ నాగరికత నాటివి. దీని లోని కొన్ని గ్రామాలలో పురావస్తు శాఖ హరప్పా మరియు మొహంజొదారో ల నాటి అవశేషాలు కనుగొన్నారు.

భౌగోలికత, సంస్కృతి, మరియు సాంప్రదాయం

మానస సిటీ దాని సరిహద్దులు బతిండ జిల్లా తో , సంగ్రూర్ జిల్లాతో కలిగి వుంది. దక్షిణం వైపున హర్యానా తో సరిహద్దు కలిగి వుంది. ఈ సిటీ కి భాయ్ గురుదాస్ పునాది రాయి వేసి నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్చ్ - ఏప్రిల్ నెలల్లో ఆయన గౌరవార్ధం ఒక ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భక్తులు లడ్డూలు, బెల్లం వంటివి అతని సమాధిపై పెడతారు. హోలీ, దీవాలి, దసరా, బైసాఖి మరి కొన్ని ఇతర పండుగలు ఎంతో వైభవంగా జరుపుతారు.

బైసాఖి సాధారణంగా ఏప్రిల్ 13 వ తేదీన వస్తుంది. అపుడు రైతులు ఈ పండుగను చేసుకుంటారు. తమకు భవిష్యత్తులో పంటలు బాగా పండాలని కోరుకుంటారు.

మానస ను 'తెలుపు బంగారం ప్రదేశం' అని అంటారు. ఇది పంజాబ్ లో మంచి సారవంతమైన ప్రదేశంలో వుంది. కనుక వ్యవసాయం ఇక్కడ ప్రధాన వృత్తి. కాటన్ ప్రధాన పంట. స్థానికులు స్నేహపూరితంగా వుంటారు. రోడ్ సైడ్ దాబాలలో అనేక స్థానిక రుచుల వంటకాలు లభిస్తాయి. ఈ దాబాలే కాక, సిటీ లో అనేక హోటళ్ళు, రెస్టారెంట్ లు కూడా కలవు.

మానస లోను, చుట్టుపట్ల కల ఆకర్షణలు

మానస లోను చుట్టుపట్ల అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. భిఖి మరియు బరేతా , బుద్లాడ, దలేల్ వాలా, సర్డుల్ ఘర్ వంటి సమీప ప్రదేశాలకు టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా సందర్శిస్తారు.

మానస ఎలా చేరాలి ?

మానస రాష్ట్ర రాజధాని చండి ఘర్ కు, దేశ రాజధాని న్యూ ఢిల్లీ కి చక్కగా అనుసంధానించబడి వుంది. ఉత్తర రైల్వే యొక్క ఢిల్లీ - బతిండ లైన్ లో వుంది. న్యూ ఢిల్లీ నుండి అనేక పాసెంజర్ రైళ్ళు నడుస్తాయి. ప్రధాన నగరాలనుండి అనేక బస్సులు కూడా కలవు. లూధియానాలోని సహ్నేవాల ఎయిర్ పోర్ట్ మానసకు సమీప ఎయిర్ పోర్ట్. ఇది 140 కి.మీ.ల దూరంలో కలదు.

మానస సందర్శనకు ఉత్తమ సమయం

మానస పట్టణంలో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని వుంటుంది. దుమ్ముతో కూడిన వేడి వేసవులు, అతి తక్కువ వర్షపాతం, అధిక తేమ స్థాయిలు వుంటాయి. వర్షాకాలం తర్వాత అంటే అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో చల్లని వాతావరణం ఏర్పడి పర్యటనకు అనుకూలంగా వుంటుంది. దీని తర్వాత వచ్చే శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లని గాలులు కలిగి వుంటుంది.

మనసా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మనసా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మనసా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మనసా

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in మనసా
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం బతిండ - జింద్ - ఢిల్లీ రైల్వే లైన్ లో కల మానస్ న్యూ ఢిల్లీ నుండి తరచుగా చేరవచ్చు. ప్రధాన పాసెంజర్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం లూద్ధియనా లోని సహ్నేవాల్ ఎయిర్ పోర్ట్ మనసకు సమీప ఎయిర్ పోర్ట్. దీనిని చేరాలంటే టాక్సీ పై రెండున్నర గంటలలో రోడ్డు మార్గంలో చేరాలి. ఈ ఎయిర్ పోర్ట్ లో ప్రధాన ఎయిర్లైన్స్ అయిన ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో మొదలైనవి డైలీ ఫ్లైట్ లు దేశం లోని వివిధ ప్రాంతాలకు నిర్వహిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri