Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జలియన్వాలాబాగ్

జలియన్వాలాబాగ్ – బలిదానాలను ప్రతిధ్వనించే భూమి!

8

జలియన్వాలాబాగ్ బ్రిటీష్ పాలన సమయంలో అత్యంత అపఖ్యాతి పాలైన భారతీయులకు లోతైన మచ్చగా మిగిల్చిన ఊచగోత కధ. 6.5 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ జలియన్వాలాబాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమ్రిత్సర్ నగరానికి గుర్తుగా ఉన్న ఒక పబ్లిక్ గార్డెన్. అపారమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిఉన్న ఈ స్మారక స్థలం భారతదేశ అప్పటి అధ్యక్షుడు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1961 ఏప్రిల్ 13 న పంజాబీ కొత్త సంవత్సరం సందర్భంగా దీనిని ప్రారంభించారు. చారిత్రిక గుర్తింపు ఉండడం వల్ల, జలియన్వాలాబాగ్ పర్యటన రాష్ట్రాన్ని సందర్శించే ప్రతి పర్యాటకుడిని ఆకర్షిస్తుంది.

జలియన్వాలాబాగ్ వద్ద నరమేధం

జలియన్వాలాబాగ్ పేరు కూడా ప్రతి భారతీయుడి దేశభక్తి స్పూర్తిని రేకెత్తిస్తుంది, ఇది భారత స్వాతంత్ర్య పోరాట మొత్తం చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనలను తిరిగి తీసుకువస్తుంది. డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటీషు సైనికులు శాంతియుత ప్రజా సమావేశంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు నిరాయుధ సేకరణ కాల్పులను ప్రారంభించింది ఇక్కడే. 1919 ఏప్రిల్ 13 న జరిగిన ఈ సంఘటన ఫలితంగా భారతదేశంలోని వందలమంది అమాయక పౌరులు మృతిచెందారు.

జలియన్వాలాబాగ్ విషాద సంఘటనలో అమరవీరులను గుర్తుచేసుకోవడం

1961 లో, ఈ స్మారకం క్రూరమైన కాల్పులలో తమ ప్రాణాలు కోల్పోయిన ప్రజల త్యాగానికి గుర్తుగా 1919 లో అమ్రిత్సర్ లో ఈ నరమేధ స్థలాన్ని నిర్మించారు. ఈ రోజు, భయంకరమైన తూటాల దాడికి గురైన ఈ పార్కు సరిహద్దు గోడపై తూటాల గుర్తులు కనిపిస్తాయి. ఈ పార్కు లోపల తూటాల దాడికి భయపడిన ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి మునిగిపోయిన భావి కూడా ఉంది.

ఈ పబ్లిక్ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద చరిత్ర పద్దులను తెలియచేసే ఒక స్మారక టాబ్లెట్ కూడా ఉంది. తోట మరోభాగంలో ‘లిబర్టీ ఫ్లేమ్’ ఉంది, ఇది జలియన్వాలాబాగ్ విషాద ఊచకోత సమయంలో మరణించినవారి స్మృత్యర్ధం వెలిగించిన శాశ్వతమైన ఫ్లేమ్. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న స్మారక సహితమైన ఈ పార్క్ శీతాకాలంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు, వేసవిలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రతి రోజు తెరిచిఉంటుంది. జలియన్వాలాబాగ్ పర్యటనలో సందర్శకులు స్వర్ణ దేవాలయం, వాగా సరిహద్దు వంటి సమీప ప్రసిద్ధ ఆకర్షణలను కూడా చూడవచ్చు.

జలియన్వాలాబాగ్ చేరుకోవడం ఎలా

పర్యాటకులు అమ్రిత్సర్ రైల్వే స్టేషన్ నుండి రైలు ద్వారా, శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం ద్వారా జలియన్వాలాబాగ్ చేరుకోవచ్చు. నగరంలోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయ౦ నుండి చాలా తక్కువ దూరంలో ఉన్న ఈ పార్క్ కు ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు, బస్సులు లేదా అద్దె కార్ల వంటి రవాణా సదుపాయాల ద్వారా శులభంగా చేరుకోవచ్చు.

జలియన్వాలాబాగ్ లో వాతావరణం

జలియన్వాలాబాగ్ లో వర్షాకాలంలో ఉష్ణోగ్రత మధ్యస్తంగా ఉండి, వేసవి, శీతాకాలాలు అధికంగా ఉంటాయి.

జలియన్వాలాబాగ్ సందర్శనకు ఉత్తమ సమయం

ఈ పార్క్ ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు కానీ, అక్టోబర్ నుండి మార్చ్ వరకు జలియన్వాలా బాగ్ లో చాలా చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి పర్యాటకులు ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.

జలియన్వాలాబాగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జలియన్వాలాబాగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జలియన్వాలాబాగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జలియన్వాలాబాగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా జలియన్వాలాబాగ్ ను అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన ఒకటవ నంబరు జాతీయ రహదారి గుండా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా జలియన్వాలాబాగ్ కు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉన్న అమ్రిత్సర్ సమీప రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చేరుకోవడం ఎలా వాయుమార్గం ద్వారా జలియన్వాలాబాగ్ కు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న అమ్రిత్సర్ సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon