మోర్జిన్ బీచ్ లో అరేబియా సముద్రం అద్భుతంగా కనపడుతుంది. ఉత్తర గోవా తీర ప్రాంతంలో ఎంతో అందమైన ప్రదేశం. సముద్రపు ఆహారం మరియు కొబ్బరి కాయలు వంటివి పుష్కలంగా దొరుకుతాయి. ఛర్పోరా నది సమీపంలో ఉంటుంది. అద్భుత ప్రకృతి అందాలు. నిశ్శబ్ద మధ్యాహ్నాలు, సాయంత్రపు నీరెండలు మరచిపోలేని అనుభూతులనిస్తాయి.
పుస్తకాలు చదవాలన్నా, ఆలోచనలు చేయాలన్నా, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేసుకోవాలన్నా మోర్జిం మంచి ప్రదేశం. గోవా డ్యాన్సులు ఇక్కడ ప్రసిద్ధి. కొబ్బరి బెల్లం కూడా దొరుకుతుంది. ఇవే కాక, గోవా సాంప్రదాయాలకు, ఆచారాలకు ఈ ప్రాంతం అద్దం పడుతుంది. అద్దె బైక్ సహాయంతో మోర్జిం పర్యటించండి. క్యాబ్ లు సరసమైన ధరలలో మీకు లభించకపోవచ్చు.



Click it and Unblock the Notifications