హజారిద్వారి భవనం ఎంతో ప్రసిద్ధ ఆకర్షణ. ఈ పేరుకు అర్ధం వెయ్యి ద్వారాల భవనం, దీనికి వెయ్యి ద్వారాలు ఉన్నాయి. నగర కేంద్రానికి వన్నె తెచ్చే ఈ తెల్లని పెద్ద నిర్మాణం దాని వైభవానికి ప్రసిద్ధి చెందింది. 2 ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉన్న ఒక పెద్ద గడ్డి నడవా రూప లావణ్యాలను, ఆకర్షణను రెట్టింపు చేస్తుంది. దీని ఆకృతిలో వలసవాద ప్రభావం, పొడవైన గుండ్రటి దారులు మధ్యాహ్న సమయం గడపడానికి ఒక గొప్ప స్థలంగా మారుస్తాయి. హజార్ ద్వారి భవనంలో అనేక నిర్మాణాలు, శిల్పాలు, ప్రాంగణం లోపల తుపాకి టుర్రెట్లు ఉన్నాయి.
1829 లో నిర్మించిన ఈ భవనాన్ని పరిరక్షించడంలో భారత పురావస్తు శాఖ వారు ఎంతో గొప్ప పని చేసారు. ఇది ప్రస్తుత౦ చూడకల్గిన భవనం కం మ్యూజియం.