Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగర హోళే » వాతావరణం

నాగర హోళే వాతావరణం

నాగరహోళే వాతావరణం నాగరహోళే సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే సందర్శించవచ్చు. అయితే, అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శనకు సమయం అనుకూలం. అపుడు అడవులు పచ్చగా కన్నుల విందు చేస్తూంటాయి. అంతేకాక, అనేక జంతువులను కూడా బాగా చూసి ఆనందించవచ్చు.

వేసవి

వేసవి (మార్చి నుండి ఏప్రిల్) - వేసవిలో నాగర హోళే వాతావరణం ఒక మాదిరి ఉష్ణోగ్రతలతో పగటి వేడి 33 డిగ్రీలుగా ఉంటుంది. వేసవిలో పర్యాటకులు అధిక సంఖ్యలో దర్శిస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో నాగరహోళే ఒక మాదిరి వర్షాలు కలిగి ఉంటుంది. అయితే, జంతువులు సరిగా సంచరించవు కనుక పర్యాటకులు అధికంగా దర్శించరు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి జనవరి) - శీతాకాలంలో నాగర హోళే ప్రాంతం ఎంతో అందంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా ఉండి పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది.