Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాగర్ కోయిల్

నాగర్ కోయిల్ - ప్రకృతి ఒడిలో...!

8

తమిళనాడు లోని ప్రశాంతమైన పట్టణం నాగర్ కోయిల్ కన్యాకుమారికి దగ్గరగా, భారత ద్వీపకల్పపు దక్షిణ అంచుకు దగ్గరగా, భారత భూభాగంలో అన్నిటికన్నా దక్షిణాన దూరంగా వున్న ఊరు. ప్రశాంతంగా వుండే ఈ వూరు ప్రకృతి మాత చేత దీవి౦చబడి చాలా అందమైన అద్భుత దృశ్యాలు కలిగి వుండడం వల్ల జనారణ్యాల నుంచి వచ్చిన పర్యాటకులకు కనువిందు చేయడం వల్ల పర్యాటకులలో ప్రసిద్ది చెందింది.

ఇతిహాసాల ప్రకారం, ఈ ప్రాంతానికి ఊరి మధ్యలో వున్న నాగరాజ దేవాలయం (సర్ప దేవత గుడి) పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. ఈ గుడి ఈ రాష్ట్ర ప్రజల౦దరికీ చాలా ముఖ్యమైన పూజా స్థలం. ఈ గుడి ప్రతి ఏటా వేలాదిగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. కొంతమంది ఈ గుడి స్థానంలో ఒకప్పుడు జైన దేవాలయం ఉండేదని నమ్ముతారు.

వైభవం, సాహసాలకు పెట్టింది పేరైన ఈ ఊరి ప్రజలు తమ చారిత్రిక ఘనత పట్ల చాలా గర్విస్తూ వుంటారు. 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 10 ఏళ్ళ వరకూ ఈ పట్టణం ట్రావన్కూర్ సంస్థానంలో వుండేది. 1956 లో ఇది కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో భాగం అయింది. ఆ రోజుల్లో ఈ ఊరిని నంజిల్ నాడు అనేవారు.

ఈ ఊరు వివిధ వంశాలకు చెందిన రాజులను చూసింది. చేరులు, చోళులు, పాండ్యులు నాగర్ కోయిల్ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్తారు. ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూమి కలిగి వుండడం వల్లా, సాగుకు అనుకూలంగా వుండడం వల్లా వివిధ రాజ్యాలు ఈ పట్టణం కోసం యుద్ధాలు చేసేవారు.

జలపాతాలు, ప్రాకృతిక అందం గురించి – నాగర్ కోయిల్ లోను చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాల గురించి

ప్రస్తుతం, అందమైన దృశ్యాల వల్ల నాగర్ కోయిల్ తమిళనాడు లోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఇది ఒక వైపు అరేబియన్ సముద్రం, మరో వైపు పశ్చిమ కనుమల మధ్య నెలకొని వుంది. కొండల అంచుతో మెత్తటి గడ్డి, నీలం పచ్చటి నీళ్ళతో వున్న సముద్రం మొదటి సారి ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి కనువిందు చేస్తాయి. కన్యాకుమారిలో గానీ, చుట్టు పక్కల గానీ వుంటే, చాలా మంది దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి తప్పక వస్తారు. ఇక్కడి అందమైన దృశ్యాలు, ప్రాకృతిక సౌందర్యం వల్ల ఈ పట్టణం పర్యాటక ప్రదేశంగా ప్రాముఖ్యం పొందింది. ఈ ప్రదేశం ముఖ్యంగా ఒలకరువి జలపాతాలకు ప్రసిద్ది చెందింది. పైగా .....

ఇక్కడి ప్రజలు కూడా శాంతి కాముకులు, పర్యాటకులను ప్రేమాభిమానాలతో చూసుకునే మర్యాదస్తులు కూడా. ఈ పట్టణం పర్యాటకులకు చాలా సురక్షితం, ఎందుకంటే ఇక్కడ నేరాలు అరుదుగా జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా పై అధికారుల దాకా పోకుండా, హింసకు తావు లేకుండా తమలో తాము పరిష్కరించుకుంటారు.

ఇక్కడ లవంగాలు, ఏలకుల తోటలు వుంటాయి, స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారు ఈ ప్రాంతం లో స్థిరపడి ఇది అలవాటు చేసారు. బ్రిటిష్ సంతతి వారిలో చాలా మందికి ఇప్పటికీ ఇక్కడ కొన్ని తోటలు వున్నాయి. మీరు ఈ తోటల ప్రాంతం లోనికి చేరగానే ఏలకుల సువాసన మిమ్మల్ని తాకుతుంది.

దీని ఆసక్తికరమైన భౌగోళిక స్థితి వల్ల నాగర్ కోయిల్ లో తూర్పు, పశ్చిమ కనుమల సంస్కృతుల మేళవింపు కనిపిస్తుంది. నిజానికి, ఈ పట్టణం కూడా తూర్పు, పశ్చిమ రైల్వేలు కలిసే చోటు. ఒక లైన్ కేరళ గుండా వెళ్తూ కొంకన్ రూట్ లో వుంటుంది. ఇంకోటి తమిళనాడు గుండా వెళ్తూ తిరునెల్వేలి రూట్ లో వుంటుంది.

 నాగర్ కోయిల్ వాతావరణం

నవంబర్ మధ్యలో ప్రారంభమయ్యే శీతాకాలంలో నాగర్ కోయిల్ లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 20-22 డిగ్రీల మధ్య స్థిరంగా ఉంటుంది. వాతావరణంలో తేమ తగ్గిపోవడం వల్ల ఆహ్లాదకరంగా ఉండి ప్రయాణానికి అనువుగా ఉంటుంది. అయితే, సాయంత్రాలు కొద్దిగా చల్లగా ఉండడం వల్ల చలి నుండి తప్పించుకోవడానికి కొన్ని ఊలు దుస్తులు అవసరమౌతాయి.

వాతావరణం వెచ్చగా ఉండే అక్టోబర్, ఫిబ్రవరి మాసాల మధ్య నాగర్ కోయిల్ సందర్శించడం ఉత్తమం. స్థల సందర్శనకు ఇది ఉత్తమ సమయం, వర్షాకాలంలో తేమ నుండి, వేసవిలోని భరించలేని వేడినుంది తప్పించుకొని ఈ ప్రాంతంలో ప్రయాణం చేయవచ్చు. నిజానికి, అనేకమంది పర్యాటకులు ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రాధాన్యత నిస్తారు.

నాగర్ కోయిల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగర్ కోయిల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగర్ కోయిల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగర్ కోయిల్

  • రోడ్డు ప్రయాణం
    ఈ పట్టణం బాగా నిర్వహించబడే రహదారులతో పాటు రెండు రైల్వే స్టేషన్ల తో మంచి నెట్వర్క్ ఉండడం వల్ల రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది, ఈ ఈ రెండు రైల్వే స్టేషన్ లకి ఇరుగుపొరుగు రాష్ట్రాలు, నగరాల నుండి అనేక ప్రధాన రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    నాగర్ కోయిల్ రెండు రైల్వే స్టేషన్ల ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపబడుతుంది; ఒకటి త్రివేండ్రం సెంట్రల్, రెండవది తిరునెల్వేలి జంక్షన్. ఈ రెండు రైల్వే స్టేషన్ల నుండి నాగర్ కోయిల్ కి ప్రతిరోజూ రైళ్ళు నడుస్తాయి. ఈ పట్టణం నాగర్ కోయిల్ రైల్వే స్టేషన్ నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్యాకుమారి కి కూడా రైలు ద్వారా కలుపబడి ఉంది. రైలు ద్వారా కన్యాకుమారి నుండి నాగర్ కోయిల్ చేరుకోవడానికి షుమారు 10 నిమిషాలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నాగర్ కోయిల్ లేదా కన్యకుమారి వద్ద విమానాశ్రయం లేదు. కేరళ రాజధాని తిరువంతపురం లోని తిరువంతపురం కన్యాకుమారి కి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి, కన్యాకుమారికి మధ్య దూరం షుమారు 82 కిలోమీటర్లు. తిరువంతపురం వద్ద ఉన్న విమానాశ్రయం దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో, కొన్ని అంతర్జాతీయ దేశాలతో కూడా విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue