అమ్బాజారి చెరువు నాగపూర్ లోని ప్రధాన ఆకర్షణ. 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని వుండే ఈ చెరువు మంచి విహార స్థలం.మధ్యలో వుండే సంగీత జలధార తో సహా దీని చుట్టూ అందమైన తోట వుంది. పిల్లలు ఆడుకోవడానికి చాల ఇష్టపడే ప్రదేశం ఇది. చిన్న రైలు, బోటింగ్ సౌకర్యం, చాల ఉయ్యాలలు, సవారీలు కూడా అందుబాటులో వున్నాయి.ఇక్కడి ప్రశాంతమైన చెరువు అందించే అద్భుత దృశ్యాల వెంట ఉదయ వ్యాహ్యాళికి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు.



Click it and Unblock the Notifications