Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నీమచ్ » వాతావరణం

నీమచ్ వాతావరణం

ఉత్తమ కాలం నీమచ్ సందర్శించటానికి అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య చాలా అనుకూలంగా ఉంటుంది. పర్యాటకులకు సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ప్రదేశం సందర్శించటం అనుకూలంగా ఉన్నప్పటికీ, పైన చెప్పిన నెలలలో దర్శించటం మంచిది. నీమచ్ లో పర్యాటకులు ఈ సమయంలో నివాసం సౌకర్యవంతంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం: నీమచ్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ సమయంలో పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. పర్యాటకులకు ఈ వేసవి సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించటం అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం: నీమచ్ లో ఈ కాలం చాలా ఉల్లాసంగా ఉంటుంది. కావలసినంత మేర వర్షపాతం ఉండి, ఈ వానాకాలం ఈ ప్రదేశానికి అందాన్ని తెస్తుంది. నీమచ్ సరాసరి వర్షపాతం 1243.6 మి. మీ. ఈ సమయంలో నీమచ్ ను సందర్శించటం ఒక మరచిపోలేని అనుభూతి.

చలికాలం

శీతాకాలం:నీమచ్ లో శీతాకాలం నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 19.42 డిగ్రీలు ఉంటుంది. ఈ సమయంలో సాయంకాలాలు చల్లగా ఉంటాయి మరియు పర్యాటకులకు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. వేసవిలో లాగానే, ఈ కాలంలో కూడా ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి.