నెర్సా గ్రామం పర్యాటకులు భీమ్ ఘడ్ కూడా చూడవచ్చు. ఇది సహజ రాళ్ళతో కట్టిన కోట కలిగి ఉంటుంది. దట్టమైన అడవుల మధ్య ఉంది. చారిత్రక వాస్తవాల మేరకు భీమ్ ఘడ్ మరాఠా రాజు శివాజి ఉపయోగించాడని చెపుతారు. ప్రజల కధనం మేరకు పాండవులు, భీముడు ఈ ప్రదేశంలో సంచరించారని, భీముడి పేరుతో భీమ్ ఘడ్ అని దీనికి పేరు పెట్టారని చెపుతారు. సహజ అందాలను సందర్శించి ఆనందించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో నచ్చుతుంది.



Click it and Unblock the Notifications