నెర్సా వాతావరణం నెర్సా సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) - నెర్సాలో వేసవి వేడిగా అసౌకర్యంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు. వ్యాలీ ప్రదేశం కనుక ట్రెక్కింగ్ కు, జంతువులను చూసేందుకు వేసవి అయినా సరే పర్యాటకులు వస్తారు.
వర్షా కాలం (జూన్ నుండి సెప్టెంబర్) - నైరుతి రుతుపవనాల కారణంగా నెర్సాలో వర్షపాతం ఒక మోస్తరు మాత్రమే. ఈ కాలంలో ట్రెక్కింగ్ సౌకర్యం కాదు కనుక పర్యాటకులు తక్కువ సంఖ్యలో వస్తారు.
శీతాకాలం ( డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - చలికాలంలో నెర్సా వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. కనుక పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.