Search
  • Follow NativePlanet
Share
» »అలర్ట్ః ఫిబ్రవరి 29 నుండి ప‌లు రైళ్లు రద్దు.. మ‌రికొన్ని రీషెడ్యూల్

అలర్ట్ః ఫిబ్రవరి 29 నుండి ప‌లు రైళ్లు రద్దు.. మ‌రికొన్ని రీషెడ్యూల్

వాల్తెర్‌ డివిజన్‌లోని పార్వతీపురం మరియు గుమడ స్టేషన్‌ల మధ్య 3వ లైన్‌నులో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా అనేక రైళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ ప‌నులు 29 ఫిబ్రవరి నుండి 5 మార్చి 2024 వరకు కొన‌సాగ‌నున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని అనేక రైలు సేవలపై ప్రభావం చూప‌బోతోంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప‌లు రైళ్ల రద్దుతోపాటు కొన్ని దారి మళ్లింపుల కోసం ఉత్తర్వులు జారీ చేసింది.

trainslist

రైళ్ల రద్దు జాబితా..

రైలు నెం 08528 విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్రత్యేక ప్యాసింజర్ (29/02/24 నుండి 5/03/24)

రైలు నెం. 08527 రాయ్‌పూర్-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ (29/02/24 నుండి 5/03/24)

రైలు నెం. 08504 విశాఖపట్నం-భవానీపట్న ప్రత్యేక ప్యాసింజర్ (29/02/24 నుండి 5/03/24)

రైలు నెం. 08503 భవానీపట్న-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ (1/03/24 నుండి 6/03/24)

రైలు నెం. 08546 విశాఖపట్నం-కోరాపుట్ ప్రత్యేక ప్యాసింజర్ (29/02/24 నుండి 5/03/24)

రైలు నెం. 08545 కోరాపుట్-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ (29/02/24 నుండి 6/03/24)

రైలు నెం. 18512 విశాఖపట్నం-కోరాపుట్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (1/03/24 నుండి 4/03/24)

రైలు నెం. 18511 కోరాపుట్-విశాఖపట్నం బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (2/03/24 నుండి 5/03/24)

రీషెడ్యూల్ చేసిన రైళ్లు

- రైలు నెం. 22847 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ SF ఎక్స్‌ప్రెస్. మార్చి 3న విశాఖపట్నం నుండి బయలుదేరే ఈ రైలు 5 గంటల 30 నిమిషాలకు రీషెడ్యూల్ చేయబడుతోంది. ఉదయం 8:20 గంటలకు బయలుదేరడానికి బదులుగా మధ్యాహ్నం 1:50 గంటలకు బయలుదేరుతుంది.

- రైలు నెం. 20810 నాందేడ్-సంబల్‌పూర్ SF ఎక్స్‌ప్రెస్. వాస్తవానికి ఈ ట్రైన్‌ నాందేడ్ నుండి మార్చి 2 మరియు 4 తేదీల్లో బయలుదేరాల్సి ఉంది. ఇది 4 గంటలకు రీషెడ్యూల్ చేయబడి. సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరడానికి బదులుగా రాత్రి 8:30 గంటలకు బయలుదేరుతుంది.

trains schedule

- రైలు నెం. 08312 ఈరోడ్-సంబల్‌పూర్ స్పెష‌ల్‌ ఎక్స్‌ప్రెస్. మార్చి 1న ఈరోడ్ నుండి బయలుదేరుతుంది. ఇది 2 గంటలకు రీషెడ్యూల్ చేయబడింది. మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరడానికి బదులుగా 3:45 గంటలకు బయలుదేరుతుంది.

- రైలు నెం. 08190 ఎర్నాకులం-టాటా స్పెషల్ ఎక్స్‌ప్రెస్. ఫిబ్రవరి 29న ఎర్నాకులం బయలుదేరుతుంది. ఇది 2 గంటలు రీషెడ్యూల్ చేయబడుతుంది. ఉదయం 07:15కి బయలుదేరడానికి బదులుగా 9:15 గంటలకు బయలుదేరుతుంది.

కింది రైళ్లు వివిధ మార్గాలకు మళ్లించబడతాయి

రైలు నెం. 12807 విశాఖపట్నం-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి 29 ఫిబ్రవరి, 2 మార్చి, 3 మార్చి, మార్చి 5 తేదీల్లో బయలుదేరి దువ్వాడ-విజయవాడ-బల్హర్షా మీదుగా దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తుంది. రైలు నెం. 12808 నిజాముద్దీన్-విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ 29 ఫిబ్రవరి, 1 మార్చి, 2 మార్చి, మార్చి 4 తేదీల్లో నిజాముద్దీన్‌లో బయలుదేరి బల్హర్షా-విజయవాడ-దువ్వాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ట్రైన్ నెం. 12843 పూరీ-అహ్మదాబాద్ SF ఎక్స్‌ప్రెస్ 29 ఫిబ్రవరి, 1 మార్చి, 2 మార్చి, మార్చి 5 తేదీలలో పూరి నుండి బయలుదేరుతుంది. ఖుర్దా రోడ్-కెరెజంగా-టిట్లాగఢ్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ట్రైన్ నెం. 12844 అహ్మదాబాద్-పూరీ SF ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ నుండి 29 ఫిబ్రవరి, 2 మార్చి, 3 మార్చి, 4 మార్చిలలో బయలుదేరుతుంది. టిట్లాగఢ్-కెరెజంగా-ఖుర్దా రోడ్డు మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

ట్రైన్ నెం. 22974 పూరీ-గాంధీధామ్ SF ఎక్స్‌ప్రెస్ మార్చి 2న పూరి నుండి బయలుదేరుతుంది. ఖుర్దా రోడ్-కెరెజంగా-టిట్లాగఢ్ మీదుగా దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తుంది. రైలు నెం. 22973 గాంధీధామ్-పూరి SF ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 28న గాంధీధామ్ నుండి బయలుదేరి టిట్లాగఢ్-కెరంగ్-ఖుర్దా రోడ్డు మీదుగా దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తుంది. రైలు నెం. 20837 భువనేశ్వర్-జునాగఢ్ రోడ్ SF ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుండి ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు భువనేశ్వర్-కెరెజంగా-టిట్లాగర్ మీదుగా మళ్లించబడిన మార్గంలో నడుస్తుంది. ట్రైన్ నెం.

20838 జునాగఢ్ రోడ్-భువనేశ్వర్ SF ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 29 నుండి మార్చి 5 వరకు జునాఘర్ నుండి బయలుదేరుతుంది. ట్రైన్ నెం. 18189 టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ టాటా నుండి ఫిబ్రవరి 29 మరియు మార్చి 3 తేదీలలో టాటా-జరోలి-పలాస-విజయనగరం మీదుగా మళ్లించబడిన మార్గంలో నడుస్తుంది. ట్రైన్ నెం. 18190 ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 28 మరియు మార్చి 3 తేదీలలో ఎర్నాకులం నుండి బయలుదేరి విజయనగరం-పలాస-జరోలి-టాటా మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+