Search
  • Follow NativePlanet
Share
» »‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ జాబితాలో అన్న‌వ‌రం రైల్వే స్టేష‌న్‌

‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ జాబితాలో అన్న‌వ‌రం రైల్వే స్టేష‌న్‌

ప్ర‌యాణీకుల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని, ప‌రిశ‌భ్ర‌మైన ప‌రిస‌రాల‌ను అందించ‌డం ద్వారా కొన్ని రైల్వేస్టేష‌న్‌లు అరుదైన గుర్తింపు పొందుతాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది అన్న‌వ‌రం రైల్వేస్టేష‌న్‌. FSSAI (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి 'ఈట్‌ రైట్‌ స్టేషన్‌' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. మ‌రి ఇంత‌కీ ఈట్ రైట్ స్టేష‌న్ అంటే ఏంటి? ఆ స‌ర్టిఫికేట్‌ను ఎవ‌రు.. ఎందుకు ఇస్తారు? అన్నవరం రైల్వే స్టేష‌న్ ఈట్ రైట్ స్టేష‌న్ స‌ర్టిఫికెట్ పొందటానికి ఎలాంటి నిబంధ‌న‌లు పాటించారు.. వంటి విష‌యాలను తెలుసుకుందాం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్‌ టౌన్‌ స్టేషన్‌లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన FSSAI (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి 'ఈట్‌ రైట్‌ స్టేషన్‌' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో హైదరాబాద్‌ (నాంపల్లి) తర్వాత రెండోదిగా గుర్తింపుపొందింది. 'ఈట్‌ రైట్‌ స్టేషన్‌' సాధించేందుకు డివిజన్‌ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు.

annavaramrailwaystation

'ఈట్ రైట్ స్టేషన్వ్' అంటే ఏంటి?

ఈట్ రైట్ ఇండియా ఉద్యమం భారతీయులందరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి దేశ ఆహార వ్యవస్థను మార్చడానికి భారత ప్రభుత్వం, భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) ద్వారా కృషి చేయ‌బ‌డుతోంది. ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే రైల్వే స్టేషన్‌లకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ FSSAI ద్వారా అందించబడుతుంది.

1 నుండి 5 వరకు రేటింగ్‌లతో FSSAI-ఎంప్యానెల్ చేయబడిన థర్డ్-పార్టీ ఆడిట్ ఏజెన్సీ ఈ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తుంది. 5-స్టార్ రేటింగ్ పొంద‌డం ద్వారా ఆ స్టేష‌న్‌లో ప్రయాణికులకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉందని నిర్ధారించిన‌ట్లు సూచిస్తుంది. ఏటా ఈ త‌ర‌హా గుర్తింపును ప‌లు రైల్వే స్టేష‌న్‌లు సాధిస్తున్నాయి. త‌ద్వారా నాణ్య‌మైన, ప‌రిశుభ్ర‌మైన ప‌రిస‌రాల‌ను ప్ర‌యాణీకుల‌కు అందిస్తుంది.

annavaramrailwaystation

ప్ర‌మాణాల‌కు అనుగుణంగా..

తాజాగా అన్నవరం రైల్వేస్టేషన్‌కు అరుదైన ఈ గౌర‌వం ద‌క్కింది. ప్రతిష్టాత్మకమైన FSSAI(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి 'ఈట్‌ రైట్‌ స్టేషన్‌' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. స్టేషన్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్‌ విక్రేతలు, స్టాల్‌ యజమానులు, సరఫరాదారులకు FSSAI(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేషన్‌)­లో శిక్షణ అందించారు.

అనంతరం కమర్షియల్, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్‌ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడు­వు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి-పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించారు. అలాగే, ప్రా­రంభంలో ప్రీ-ఆడిట్‌ నిర్వహించి చివరిగా FSSAIచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంత­రం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌­కు 'ఈట్‌ రైట్‌ స్టేషన్‌' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+