Search
  • Follow NativePlanet
Share
» »ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌నుల పండుగ మేడారం జాత‌ర‌...

ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌నుల పండుగ మేడారం జాత‌ర‌...

మేడారం జాత‌ర గురించి అంద‌రికీ తెలిసిందే. ఇది ప్ర‌పంచంలోనే అతిపెద్ద గిరిజ‌నుల పండుగ‌. దీనినే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాత‌ర భారతదేశంలోని తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన మేడారంలో నిర్వహిస్తారు. ఈ గిరిజ‌నుల పండుగ‌ను ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాలకు ఒక‌సారి నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ఇది స్థానిక గిరిజన సమాజానికి రక్షకులుగా భావించే దేవతలైన సమ్మక్క, సారలమ్మల గౌరవార్థం జరుపుకుంటారు. ప్రతి రెండేళ్ల‌కు ఒక‌సారి జరుపుకునే ఈ పండుగ‌ను దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్ర‌జ‌లు త‌ర‌లి వస్తుంటారు.

ఈ సారి మేడారం జాత‌ర ఫిబ్ర‌వ‌రి 21న ప్రారంభం కానుంది. ఈ పండుగ సందర్భంగా, భక్తులు ప్రార్థనలు చేసి ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహిస్తారు. ఇక్క‌డ ఈ రోజున భ‌క్తులు అమ్మ‌వారి విగ్ర‌హాల‌ను మోస్తు సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు నిర్వ‌హిస్తారు. ఇక‌, ఈ పండుగలో జానపద నృత్యాలు, సాంప్రదాయ సంగీతం మరియు నాటక ప్రదర్శనలు వంటి అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.

ఈ మేడారం జాత‌ర‌లో సాంప్రదాయ ఆహారాలు మరియు హస్తకళలను విక్రయించే వివిధ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గిరిజన పండుగలలో ఒకటిగా నిలిచిన ఈ పండుగ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రమ‌ని చెప్పుకోవాలి.

medaramjatra

ఈ ప్రాంతంలోని గిరిజన సంఘం సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్య‌వ‌హారాల గురించి తెలుసుకోవడానికి ప్రజలకు ఇదొక సువ‌ర్ణ‌వ‌కాశం. ఇక‌, ఈ జాత‌ర‌ను తెలంగాణ కుంభ‌మేళాగా కూడా అభివ‌ర్ణిస్తారు. ఈ జాత‌ర కోసం తెలంగాణ స‌ర్కారు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను పూర్తిచేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

రూ.105 కోట్లతో మేడారం జాతర ఏర్పాట్లు...

ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో వన దేవతలను దర్శించుకోవడానికి దాదాపు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతరకు వ‌చ్చే భ‌క్తుల కోసం అన్నీఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇక‌, ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించిన రాష్ట్ర‌ప్ర‌భుత్వం మేడారం జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల‌కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను కూడా ఏర్పాటు చేసింది.

medaramjatar , Warangal

గత జాతరలతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మహాలక్ష్మీ స్కీం ఇంప్లిమెంట్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బ‌స్సుల్లో దాదాపు 40 లక్షల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు న‌డ‌ప‌నున్నారు.

అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లున్నాయి. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి.మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్‌టిసి అధికారులు వాటికి ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఆర్‌టిసి బస్సుల్లో మహాలక్ష్మీ ప‌థ‌కం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+