Search
  • Follow NativePlanet
Share
» »బాహుబ‌లి జ‌ల‌పాతం మ‌న కేర‌ళ‌లోనే ఉందండోయ్‌!

బాహుబ‌లి జ‌ల‌పాతం మ‌న కేర‌ళ‌లోనే ఉందండోయ్‌!

ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన పుడ‌మి త‌ల్లి ప్ర‌కృతి సోయ‌గాలు.. మ‌న‌సు మైమ‌ర‌చే సెల‌యేళ్ల స‌వ్వ‌డులు.. మీట‌ర్ల ఎత్తు నుంచి జాలువారే జ‌ల‌పాత‌పు అందాలు.. ఈ అనుభూతుల స‌మ్మేళ‌న‌మే అతిరాప‌ల్లి జ‌ల‌పాతం. అరుదైన జీవ‌రాసుల ఆవాసం ఇక్క‌డి అట‌వీ ప్రాంతం. నిత్యం కెమెరా క‌ళ్ల‌తో ఫోటో షూట్ చేసుకుంటూ న‌యాగ‌రా ఫాల్స్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన అతిరాప‌ల్లి జ‌ల‌పాత‌పు విశేషాల‌ను తెలుసుకుందాం!
మ‌న దేశంలోని న‌యాగ‌రా జ‌ల‌పాతం అని పిలుచుకునే అతిరాప‌ల్లి జ‌ల‌పాతం ప్ర‌కృతి ప్రేమికులు త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశం.

బాహుబ‌లి జ‌ల‌పాతం మ‌న కేర‌ళ‌లోనే ఉందండోయ్‌!

బాహుబ‌లి జ‌ల‌పాతం మ‌న కేర‌ళ‌లోనే ఉందండోయ్‌!

ఈ జ‌ల‌పాతం ఎన‌భై అడుగుల ఎత్తు, 330 అడుగుల వెడ‌ల్పుతో గంభీరంగా ఉంటుంది. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షాకాలంలో సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. ఎర్నాకుళం లేదా త్రిసూర్‌కు టూర్ ప్లాన్ చేస్తే, ఈ ప్ర‌దేశాన్నిత‌ప్ప‌క సంద‌ర్శించాలి. చుట్టూ అడ‌వి చుట్టేసిన ఈ జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఎంత సేపు గ‌డిపినా స‌మ‌య‌మే తెలియ‌దు. బాహుబలి సినిమాలో క‌నిపించే భారీ జలపాతం ఇదే అంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. పర్యాటకుల నుంచి సినిమా వారి వరకు.. అందరూ ఈ జలపాతానికి అభిమానులే. అందుకే నిత్యం షూటింగ్‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం.

వృక్ష‌, జంతుజాతుల అవ‌శేషాలకు నిల‌యం

వృక్ష‌, జంతుజాతుల అవ‌శేషాలకు నిల‌యం

అతిరాప‌ల్లి జ‌ల‌పాతం చ‌ల‌కుడి న‌దిలో ఓ భాగం. ఇక్క‌డికి చేరుకునేందుకు చ‌ల‌కుడి బ‌స్‌స్టాండ్ నుంచి ప్ర‌యివేటు వాహ‌నాలు అందుబాటులో ఉంటాయి. కేర‌ళ‌లోని అత్యుత్త‌మ ప్ర‌దేశాల‌లో ఇదీ ఒక‌టి. ఇక్క‌డికి పెద్ద‌ల‌కు 50 రూపాయ‌లు, పిల్ల‌ల‌కు రూ. 10, విద్యార్థుల‌కు రూ. 15, విదేశీ ప‌ర్యాట‌కుల‌కు రూ. 200 ప్ర‌వేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎటు చూసినా తేమ‌తో నిండి ఉండ‌టం వ‌ల్ల అనుకోని ప్ర‌మాదాలు ఎద‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అందుకే, గైడ్‌తోపాటు స్థానిక నిర్వ‌హ‌కుల సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి. ఇక్క‌డికి రాత్రి స‌మ‌యంలో చేరుకోవ‌డం నిషేధం. ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన అట‌వీ ప్రాంతం మొత్తం అనేక అరుదైన‌ వృక్ష‌, జంతుజాతుల అవ‌శేషాలకు నిల‌యంగా క‌నిపిస్తుంది. అంతేకాదు, అంత‌ర్జాతీయ ప‌క్షుల స‌మాఖ్య ఈ ప్ర‌దేశాన్ని ముఖ్య‌మైన ప‌క్షుల ప్రాంతంగా ప్ర‌క‌టించింది. ఏషియ‌న్ నేచ‌ర్ కంజ‌ర్వేష‌న్ ఈ ప్రాంతాన్ని అభ‌యార‌ణ్యం, జాతీయ పార్కుగా ఉండాల‌ని సిఫార్సు చేసింది.

కుటుంబ స‌మేతంగా గ‌డిపేందుకు..

కుటుంబ స‌మేతంగా గ‌డిపేందుకు..

ఈ జ‌ల‌పాతం చూసేందుకు జూన్ నుంచి అక్టోబ‌ర్ అనువుగా ఉంటుంది. ఈ స‌మ‌యంలో సెల‌యేరు ఉప్పొంగుతూ ప్ర‌వ‌హిస్తుంది. దీనితోపాటు ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఇది ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. కుటుంబ స‌మేతంగా గ‌డిపేందుకు ఈ అట‌వీ ప్రాంతం ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఎటుచూసినా ప‌చ్చ‌ని తివాచీ ప‌రిచిన‌ట్లు క‌నిపించే అట‌వీ ప్రాంతం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.
అతిరాప‌ల్లికి ఓ ఐదు కిలోమీట‌ర్ల దూరంలో వాజాచల్ వాట‌ర్ ఫాల్స్ కూడా ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించ‌ద‌గ్గ ప్రాంతం. ప‌క్షుల కిల‌కిలారావాల‌తోపాటు ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించాలని కోరుకునే వారికి అతిరాప‌ల్లి విహార‌యాత్ర అనువుగా ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

FAQs
ఎలా చేరుకోవాలి

కొచ్చి విమానాశ్రయం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ అతిరాపల్లి ఫాల్స్ ఉంది. అలాగే కొచ్చి నుంచి దాదాపు రోడ్డు మార్గం ద్వారా రెండు నుంచి మూడు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కొచ్చిన్‌, కేర‌ళ‌లోని ఇత‌ర ఉత్త‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు అంగ‌మ‌లీ నుంచి షార్ట్‌క‌ట్ తీసుకోవ‌చ్చు. ఈ మార్గంలో ప్ర‌కృతి అందాలను ఆస్వాదించేందుకు అనువుగా ఉంటుంది. చాల‌కుడి, కేర‌ళ‌లోని ఇత‌ర ద‌క్షిణ ప్రాంతాల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కులు అన‌మ‌ల జంక్ష‌న్ నుంచి అతిరాప‌ల్లి మార్గంలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.

NativePlanet Travel

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+