ఈ సీజన్లో రైలు ప్రయాణం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పర్వతలోయల మధ్య నుంచి రైలు వెళుతూ ఉన్నప్పుడు కలిగే సంతోషాన్ని అనుభవించాలే కానీ మాటల్లో వివరించడానికి వీలుకాదు.
తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులిస్తుందని మాత్రం చెప్చొచ్చు. పట్టాలపై ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను చుస్తుంటే.. ఆ అనుభవాలను మదిలో జీవితాంతం గుర్తుంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనదేశంలోని కొన్ని ముఖ్యమైన పర్వత రైలు మార్గాల గురించి తెలుసుకుందాం!

మనదేశంలోని ఆహ్లాదాన్ని పంచే రైలు మార్గాలు

డార్జిలింగ్ హిమాలయన్ రైలు మార్గం
బొమ్మరైలు, చిన్నరైలు వంటి పేర్లు కలిగిన డార్జిలింగ్ హిమాలయన్ రైలు మార్గమే న్యారోగేజ్ రైలు మార్గం. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని సిరిగులి నుంచి డార్జిలింగ్ వరకూ సుమారు 88 కిలోమీటర్ల దూరం ఈ రైలులో ప్రయాణించవచ్చు. ప్రకృతితో మమేకమయ్యేలా కనిపించి, ఇక్కడి అందాలు సందర్శకుల మనసును కట్టిపడేస్తాయి.

నీలగిరీ మౌంటైన్ రైలు మార్గం
కోయంబత్తూరుకు దగ్గర్లోని మట్టుపాళ్యం నుంచి చుక్ బుక్ మంటూ దూసుకుపోయే ఈ మార్గంలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా నీలగిరి పర్వత అందాలను మొత్తం ఈ రైలు ద్వారా ప్రయాణిస్తూ చూడవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మెట్టుపాళ్యం నుంచి బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు ఊటికి చేరుతుంది. వారంలో అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

మథేరన్ పర్వత రైలు
మహారాష్ట్రలో ఈ అందమైన రైలు మార్గం ఉంది. ప్రముఖ పర్వతమయ క్షేత్రం మథేరను చేరుకోవడానికి ఈ రైలుమార్గం అందుబాటులో ఉంటుంది. నరేల్ అనే గ్రామం నుంచి బయలుదేరే ఈ రైలు మార్గమధ్యలో ప్రకృతి రమణీయతను పర్యాటక ప్రేమికులకు పరిచయం చేస్తుంది. న్యారోగేజ్ మార్గంలో మొత్తం 12 కిలోమీటర్లను ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం జీవితంలో మర్చిపోలేని అనుభూతలను మిగులుస్తుంది. నిత్యం సందర్శకులు ఆహ్లాదం కోసం ఈ మర్గాన్నే ఎంచుకుంటారు.

కెల్కా-సిమ్లా రైలు మార్గం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా నుంచి హర్యాణ రాష్ట్రం పంచకులా జిల్లాలోని కల్కా వరకూ ఈ రైలుమార్గం సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 103 సొరంగ మార్గాలు, 864 వంతెనలు ఎదురుపడుతాయి. ఇక్కడి ప్రాంతం సముద్ర మట్టం నుంచి దాదాపు 2,151 అడుగుల ఎత్తులో సాగడం గమనార్హం. సొరంగాలలో వెళ్లేటపుడు చీకటి వెలుగుల సమ్మేళనంలా సాగే ఈ రైలు ప్రయాణం మనసారా ఆస్వాదించవచ్చు.

కంగ్రా లోయ రైలు మార్గం
హిమాలయ పర్వత పంక్తుల మధ్యన ఈ చిన్న రైలు మార్గం సాగుతుంది. పంజాబ్లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని జోగిందర్ నగర్ వరకూ ఈ కంగ్రా లోయ రైలు మార్గం అందుబాటులో ఉంది. మొత్తం 164 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం కొనసాగుతుంది. ఈ మార్గం సముద్రమట్టం నుంచి 4,230 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొండలు, లోయలు, జలపాతాల మర్గాల గుండా సాగే ఈ ప్రయాణం సందర్శకులు తమ జీవితపు డైరీలో మర్చిపోలేని క్షణాలుగా రాసుకుంటారు.

Click it and Unblock the Notifications