భారతదేశంలోని చిట్టచివరి గ్రామం ప్రత్యేకతలేంటో తెలుసా..
భారతదేశం దాదాపు ప్రతి గ్రామంలో మీరు కొన్ని విభిన్న ఆచారాలు లేదా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో పాములను పూజిస్తారు.. మరికొన్ని గ్రామాల్లో పురుషులు మాత్రమే ఆహారం వండుతారు.. ఇంకొన్ని చోట్ల చేతబడిని నమ్ముతారు. అలాంటి ఆసక్తి కరమైన విశేషం ఉన్న అలాంటి గ్రామం ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని పేరు 'లోంగ్వా'. ఇక్కడి ప్రజలు భారతదేశంలో భోజనం చేసి ఇతర దేశాలకు చేరుకుని పడుకుంటారని ఇక్కడివారు చెబుతున్నారు.
భారతదేశంలోని లాంగ్వా గ్రామం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ విశిష్ట గ్రామం గురించి తెలుసుకున్న తర్వాత ఎవ్వరైనా కాసేపు ఆలోచనలో పడతారు.
ఇంతటి అపురూపమైన ఈ గ్రామం గురించి చెప్పే ముందు అది ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈ గ్రామం భారతదేశంలోని నాగాలాండ్ మరియు మయన్మార్ సరిహద్దులో ఉంది. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం భారతదేశంలోని చివరి గ్రామంగా కూడా ప్రసిద్ధి చెందింది.

లాంగ్వా గ్రామం ఎందుకు ప్రత్యేకమైనది?
ఈ చారిత్రక గ్రామం గురించి ఒకటి కాదు చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సరిహద్దులో ఉన్నందున, ఈ గ్రామం సగ భాగం భారతదేశంలోను, సగ భాగం మయన్మార్‌లో హద్దులు పంచుకుంటుంది. అంతేకాదు, కొంతమంది ఇంటి వంటగది భారతదేశంలో ఉంటుందని మరియు వారు నిద్రించడానికి మయన్మార్‌కు వెళతారని చెబుతారు. ఇది మాత్రమే కాదు, భారతదేశంలోని కొంతమంది వ్యవసాయం చేయడానికి మయన్మార్‌కు వెళతారు మరియు కొంతమంది వ్యవసాయం చేయడానికి మయన్మార్ నుండి భారతదేశానికి వస్తారు. ఇలా రెండు దేశాల మధ్య దోబూచులాడే ఈ గ్రామం గురించి ఒక్కొక్క ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తూ ఉంది.

ఈ గ్రామ పెద్దకు నిజంగా 60 మంది భార్యలు ఉన్నారా?
గ్రామం గురించి ఏదైనా మాట్లాడుకునేముందు ఇక్కడి గ్రామ పెద్ద గురించి చెప్పుకోవాలి. ఈ గ్రామ అధిపతికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరవై మంది భార్యలు ఉన్నారని స్థానికులు చెబుతుంటారు. పూర్వం ఈ గ్రామాధిపతి సుమారు నాగాలాండ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ మరియు మయన్మార్‌లోని 70 గ్రామాలపై ఆధిపత్యం చెలాయించాడట. అక్కడివారి సంపాదనలో అగ్రభాగం అతని పరిధిలోనే ఉండేలా నిబంధన అక్కడ అమలులో ఉండేది. గిరిజన సంస్కృతిని ఆచరించే ఇక్కడివారు బహభార్యత్వం ఆచరిస్తారని చెబుతుంటారు.

ఈ గ్రామ ప్రజలు మయన్మార్ సైన్యంలో చేరుతున్నారా?
లాంగ్వా గ్రామం గురించి ఇక్కడి ప్రజలు ఇండియన్ ఆర్మీతో పాటు మయన్మార్ ఆర్మీలో పాలుపంచుకున్నారని చెబుతారు. సరిహద్దులో ఉన్న కారణంగా చాలా మందికి రెండు దేశాలలో నివాస స్థలం ఉంది. దీంతో వారు సైన్యంలో చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే, ఈ గ్రామం గురించి మరొక వింత కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలోని ప్రజలకు పుర్రెలు ధరించే ఆచారం ఉందని చెబుతుంటారు. దీనిని చూసిన కొత్తవారు ఎవ్వరైనా భయపడతారని అంటారు. ఈ గ్రామంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో చాలా ఉన్నాయట. ఇటీవల కాలంలో ఈ గ్రామం కూడా పర్యాటక ప్రదేశంగా పేరుపొందింది.



Click it and Unblock the Notifications












