భారతదేశంలో ఎన్నో ప్రత్యేక ఆలయాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన, పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లోనే అతి పురాతనమైన అలాడే, దేశంలోని తొలి దుర్గమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోనే ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయ దర్శనం చేసుకోవాల్సిందే. రండి ఈ ఆలయ విశిష్టతలేంటో తెలుసుకుందాం పదండి.
క్రీ.శ. 105 లో నిర్మించిన ఆలయం..
రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారులు చెబుతున్నారు. బీహార్‌లోని ఈ ఆలయం వెయ్యేళ్ల కాలం నాటి పురాతన ఆలయంగా చెబుతున్నారు. అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయ ఇది. ఈ ఆలయం పేరు ముండేశ్వరి దుర్గామాత ఆలయం. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ఈ ఆలయం పేరుగాంచింది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇదే అని చరిత్రకారులు చెబుతున్నారు.

వారణాసి సమీపంలో ఆలయం..
ఈ ఆలయంలో శివుని విగ్రహం కొలువై ఉంది. ఈ విగ్రహాన్ని ఏడో శతాబ్దంలో పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి సుమారు 608 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ సమీపంలో 625 సంవత్సరం నాటి శాసనాలు బయటపడ్డాయి. దేశంలోని అత్యధిక పూజాదికాలు నిర్వహించే అతి పురాతన ఆలయాలలో దీనిని ప్రథమంగా చెప్పొచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇదేనని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయంలోని దుర్గాదేవి వైష్ణవి మాతా రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా భక్తులకు కనిపిస్తోంది.

ముండేశ్వరి మాత చూసేందుకు కొంత వరకూ వరాహి మాతగా మనకు దర్శనమిస్తోంది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయంగా పేరొందింది. ఈ ఆలయాన్ని100ఏడిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ అమ్మవారు భక్తులకు వరాహి మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ ఆలయం వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మరో ప్రత్యేకత..
ఈ ఆలయంలోని అమ్మవారు పది చేతులతో ఎద్దు పైన స్వారీ చేస్తూ ఉంటారు. మహిషాసురమర్ధిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు కూడా నాలుగు ముఖాలతో ఉంటాడు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటటే.. రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. చైత్రమాసంలో భక్తులు ఎక్కువ ఈ ఆలయాన్ని సందర్శించేందుకు అధికసంఖ్యలో వస్తూ వుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం.

అంతేకాకుండా ఈ ఆలయంలో నాలుగు ముఖాలు కలిగిన శివుడు, విష్ణుభగవానుడు ఉన్నారు. ఈ ఆలయం తాంత్రికపూజలకు ప్రతీకగా కూడా నిలిచింది. ఈ ఆలయంలో నిర్వహించే సాత్విక బలి ఎంతో ప్రత్యేకతమైనది. ఇక్కడ అమ్మవారి ముందు మేకలను బలిస్తారు. మొదటగా బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువచ్చి, పూజారి మంత్రించిన అక్షింతలను మేకపై జల్లుతారు. దీంతో మేక కొంత సమయం పాటు స్పృహకోల్పోతుంది. వెంటనే ఆ పూజారి మరోసారి ఆ అక్షింతలను మేకపై వేస్తాడు. దీంతో ఆ మేక మళ్లీ యథాస్థితికి వస్తుంది. మరెందుకాలస్యం ఈ విజయదశమినాడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాల్సిందే.



Click it and Unblock the Notifications













