డాల్ఫిన్ నోస్ కొండ పర్యాటక ప్రాంతం కావడంతోపాటు నేవీ క్యాంపులు ఉండడంతో భద్రతా తనిఖీలు తప్పనిసరి చేశారు అధికారులు..! ప్రతి సంవత్సరం ఆగస్టు 7ని జాతీయ లైట్‌హౌస్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వేడుకను పురష్కరించుకుని నగరవాసులతోపాటు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తోంది. డాల్ఫిన్స్ నోస్ ఇండియన్ నేవీ బేస్ కిందకు వస్తుంది. అంచేత, అనుక్షణం రక్షణ శాఖ కళ్లు అన్నివైపులా ఉంటాయి. అంతేకాదు, కొండపై నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ పౌరులకు చాలా అందమైన ప్రదేశాలకు అనుమతి ఉందనే చెప్పాలి.

డాల్ఫిన్ నోస్‌పై నుంచి వైజాగ్ నగర
నేవీ డిపార్ట్‌మెంట్ కింద ఉండటంతో.. అక్కడకు వెళ్లాలంటే కొన్ని భద్రతా తనిఖీలు తప్పనిసరి. అక్కడికి వచ్చే పర్యాటకుల ఐడికార్డు(ఆధార్, వోటర్ ఐడీలాంటివి) ను తప్పనిసరిగా చూపించాకే మిమ్మల్ని లోపలికి వెళ్లనిస్తారు. నిషేధిత వస్తువులు, ఆహార పదార్థాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ జాబితాలో ఉన్న వాటిని లోపలకి అనుమతించరు.

అత్యంత సురక్షితమైన ప్రదేశం..
అన్ని వయస్సుల వారు ఇక్కడ సందర్శించవచ్చు. ఇది యారాడ బీచ్‌కి వెళ్లే మార్గంలో ఉంది మరియు ఇది నేవీ క్వాటర్స్ అత్యంత సురక్షితమైన ప్రదేశం. కేంద్ర బలగాల భద్రత నడుమ విహారమేంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. చుట్టూ ఈ కొండ ఉండడంతోపాటు కుటుంబ సమేతంగా సంద్శించ దగ్గ ప్రాంతం. పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, మంచి వ్యూ పాయింట్‌లు కోరుకునే వాళ్లు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. తినేందుకు అవసరమైన ఆహారాన్ని ఇంటినుంచే తీసుకువెళ్లడం ఉత్తమం. ఇక్కడి ధరలు అధికంగా ఉంటాయి. విశాఖపట్నంలోని ఈ డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్‌ను సందర్శించడానికి ప్రవేశ రుసుము భారతీయులకు రూ.10, విదేశీయులకు రూ.25. మూడేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు వారికి రూ.3 వసూలు చేస్తారు. మీతో పాటు కెమెరా తీసుకెళ్లాలంటే రూ.20, వీడియో కెమెరాకు రూ. 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలను పైకి తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

గమ్యస్థానం చేరుకునేందుకు ఇది ఫాలో అవ్వండి!
డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ కి వెళ్లాలి అనుకునే వాళ్ళు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కి కానీ రైల్వేస్టేషన్ కానీ చేరుకోవాలి. ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్లకు కాంప్లెక్స్ నుంచి సింధియా జంక్షన్ వరకు బస్సులో వెళ్లొచ్చు.. అదే రైలెస్టేషన్ నుంచి కూడా 99, 400 సిరీస్ నెంబర్ బస్సులు సింధియా జంక్షన్‌కు అందుబాటులో ఉన్నాయి. ఆ బస్సులు ప్రతి పదినిమిషాలకు ఒకటి ఉంటుంది. సింధియా వద్ద దిగి, బస్సు నంబర్ 16 ఎక్కితే. ఆ బస్సు నేరుగా యారాడ బీచ్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి డాల్ఫిన్ నోస్ కొండకు వెళ్లొచ్చు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పర్యాటకులకు ఎంట్రీ ఉంటుంది. వారంలో ఏడు రోజులు తెరిచే ఉంటుంది డాల్ఫిన్ హౌస్. సొంత వాహనం అందుబాటులో ఉన్నవారికి ఇది ఉత్తమమైన సందర్శనా ప్రదేశంగా చెప్పొచ్చ. మరెందుకు ఆలస్యం.. విశాఖ తీరానికి మీ ప్రయాణం మొదలుపెట్టండి!



Click it and Unblock the Notifications











