Search
  • Follow NativePlanet
Share
» »బీహార్‌లో ప‌ర్యాట‌కుల కోసం తొలిసారిగా హెలికాప్ట‌ర్ స‌దుపాయం...

బీహార్‌లో ప‌ర్యాట‌కుల కోసం తొలిసారిగా హెలికాప్ట‌ర్ స‌దుపాయం...

చాలామంది ప‌ర్యాట‌కులు రైలులో కానీ, బ‌స్సులో కానీ ప్ర‌యాణించి ఉంటారు. బీహార్‌లోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్యక్షేత్రాల‌ను ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించిన‌ప్ప‌డు కారు లేదా బ‌స్సు మార్గాల్లో ప్ర‌యాణం చేసి ఉంటారు. కానీ, హెలికాప్ట‌ర్ ప్ర‌యాణం ఎప్పుడైనా చేశారా? అయితే, బీహార్ వెళ్లేవారు ఇక హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. హెలికాప్టర్‌లో కూర్చొని తీర్థయాత్రలు, అనేక ఇతర ప్రదేశాలను హాయిగా సందర్శించవచ్చు. ప్రయాణికులు హెలికాప్టర్ సహాయంతో బుద్ధగయ, గయలను సందర్శించవచ్చు.

మహాబోధి ఏవియేషన్ హెలికాప్టర్ సర్వీస్ ద్వారా మాత్రమే ఈ సేవలు అందించ‌బ‌డ‌తాయి. హెలికాప్టర్‌లో ప్రయాణించే ఈ సర్వీస్ డిసెంబర్ 10 నుండి బుద్ధగయ, గయాలో ప్రారంభ‌మ‌య్యింది. ఈ ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేసే వారు త‌ప్ప‌కుండా ఈ వివ‌రాల‌ను తెల‌సుకోండి. టిక్కెట్‌ను ఎలా పొందొచ్చు, ధ‌ర‌ల వివ‌రాలు అన్నింటి గురించి తెలుసుకుందాం.

 helicopter facility for tourists in Bihar

హెలికాప్టర్‌లో మొత్తం 7 సీట్లు...

బీహార్ రాష్ట్రంలో తొలిసారిగా మహాబోధి ఏవియేషన్ హెలికాప్టర్ నుండి విహంగ వీక్షణను ప్రారంభ‌మ‌య్యింది. గయా విమానాశ్రయం నుండి ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు 7-సీట్ల హెలికాప్టర్ సేవ నడుస్తుంది. ఇందులో ప్రయాణించాలనుకునే వ్యక్తులు గయా నుండి బోధ్ గయా వరకు వైమానిక వీక్షణను ఆస్వాదించొచ్చు. కంపెనీ ప్రకారం, వివాహాలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, వధూవరుల వీడ్కోలు, ఎమర్జెన్సీ రెస్క్యూ కోసం హెలికాప్టర్ సౌకర్యం కూడా అద్దెకు అందుబాటులో ఉంటుంది.

మొదటి దశలో, గయా నుండి ప్రెత్ శిలా, విష్ణుపాద్ ఆలయం, రామశిల, దుంగేశ్వరి మరియు బోధ గయా వరకు హెలికాప్టర్ ప్రయాణ సేవలు అందించ‌డం జ‌రుగుతుంది. అంతేకాకుండా, గయా నుండి రాజ్‌గిర్, కుషీనగర్, సారనాథ్‌లకు విమాన ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. విమానయాన శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెలికాప్టర్‌లో ముందు సీటులో ప్రయాణించాలంటే రూ.7,000 చెల్లించాల్సి ఉంటుంది. వెనుక సీటు బుక్ చేసుకోవడానికి, రూ. 5000 చెల్లించాలి.

బౌద్ధ సర్క్యూట్ ప్యాకేజీ...

బుద్ధ సర్క్యూట్‌పై ప్రభుత్వ ప్రత్యేక ఆసక్తి మేర‌కు బౌద్ధ సర్క్యూట్‌లోని పర్యాటక ప్రదేశాలను కూడా హెలికాప్ట‌ర్ యాత్ర‌లో చేర్చ‌డం జ‌రిగింది. ఇందుకు బౌద్ధ స‌ర్యూట్ ప్ర‌త్యేక ప్యాకేజీ కూడా ఉంటుంది. ఇందుకోసం ఒకరోజు ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వైశాలి, రాజ్‌గిర్, నలంద, సారనాథ్‌ల పర్యటన ఉంటుంది. అలాగే, ఇందులో నలుగురు ప్రయాణికుల బృందం కూడా ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌తి ఒక్క విష‌యాన్ని వివ‌రించేందుకు గైడ్‌లు కూడా ఉంటారు. ఈ ప్యాకేజీలో ఆహారం, గైడ్‌తో సహా అన్ని ఖర్చులు ఇందులోకే వస్త‌యాఇ. ఈ ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ ఉంటుంది.

బౌద్ధ సర్క్యూట్ ప్యాకేజీ లుంబినీ, బుద్ధగయ, వారణాసి మరియు కుషీనగర్‌లకు నాలుగు పగలు, మూడు రాత్రుల ప్యాకేజీగా ఉంటుంది. దీనికంటూ ప్ర‌త్యేకంగా ఓ కార్యాల‌యం ఉంటుంది. అది బోధ్ గయాలోని నోడ్ వన్‌లో ఉన్న షాప్ నంబర్ 136లో ఉంటుంది. ఇందులో హెలికాప్ట‌ర్ స‌దుపాయాన్ని బుక్‌చేసుకోగ‌ల‌రు. ప‌ర్యాట‌కులు ఇక్కడ నుండి ఏరియల్ వ్యూను చూసేందుకు కూడా ప్ర‌త్యేకంగా బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+