Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ 26 నుండి.. వైజాగ్ నుంచి కౌలాలంపుర్‌కు నేరుగా విమాన స‌ర్వీసులు!

ఏప్రిల్ 26 నుండి.. వైజాగ్ నుంచి కౌలాలంపుర్‌కు నేరుగా విమాన స‌ర్వీసులు!

మ‌న దేశం నుంచి మలేషియాకు కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ ఎయిర్ ఏషియా విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కు 26 ఏప్రిల్ 2024 నుండి నేరుగా విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నుంది. ఈ స‌ర్వీసులు బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి మూడు సార్లు నడుస్తాయి. విశాఖపట్నం నుండి కౌలాలంపూర్ వెళ్లే విమానం - AK 82 - వైజాగ్ నుండి రాత్రి 10:00 గంటలకు బయలుదేరి ఉదయం 4:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో - AK 83 - కౌలాలంపూర్ నుండి రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, రాత్రి 9:30 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

ఇటీవ‌ల‌ ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ CEO బో లింగం మాట్లాడుతూ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటైన భారతదేశంలో ప‌ర్యాట‌కుల‌కు అనువైన ప్రయాణాన్ని మరింత సుల‌భ‌త‌రం చేసేందుకు త‌మ ఈ ప్ర‌య‌త్నం స‌హాయ‌ప‌డుతంద‌ని తెలిపారు. అలాగే, విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కు నేరుగా చేరుకునేందుకు ఇది అనుకూలమైన సమయంగా భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సుసంపన్నమైన సంస్కృతితో పాటు మంత్రముగ్ధులను చేసే సహజ అద్భుతాలతో కూడిన అందమైన కౌలాలంపూర్‌కు సంద‌ర్శ‌కులు చేరుకునేందుకు ఇది ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

directflightservicesfromvizagtokualalumpur1

విశాఖ అందాల‌ను చూసేందుకు..

అలాగే, స‌హ‌జ‌సిద్ధ ప్ర‌కృతి అందాల‌కు నిల‌యంగా ఉన్న‌ విశాఖపట్నం సందర్శించడానికి ఆసక్తి ఉన్న మలేషియా ప్ర‌జ‌లు నేరుగా విశాఖ చేరుకునేందుకు ఇది గొప్ప అవ‌కాశంగా భావించ‌వ‌చ్చు. వివిధ ప్రాంతాల‌ వ్యక్తులను విభిన్న సంస్కృతులను అనుసంధానం చేస్తూ, ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేలా ఈ ప్రయాణ‌పు ప్ర‌ణాళిక మంచి ఫ‌లితాల‌ను అందిస్తుంది.

భార‌తదేశ గిరిజ‌న జీవ‌న విధానాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసేందుకు మ‌లేషియా ప‌ర్యాట‌కుల‌కు విశాఖ వేదిక అనే చెప్పాలి. ఇక్క‌డి తీర ప్రాంత అందాల‌తోపాటు ప్ర‌కృతి సోయ‌గాల‌ను ఆస్వాదించేందుకు ఈ విమాన స‌ర్వీసులు మార్గాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేశాయి. అలాగే, రాబోయే రోజుల్లో ఎయిర్ ఏషియా భారతదేశంలో త‌మ‌ ఉనికిని మరింత విస్తరించడానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలూ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

ప‌ర్యాట‌క న‌గ‌రం కౌలాలంపుర్

మలేషియా రాజధానిగా ఉన్న‌ కౌలాలంపూర్ పురాత‌న‌ మరియు అధునాత‌న నిర్మాణాల‌ను మిళితం చేసే సజీవ నగరంగా నిలుస్తోంది. ఇక్క‌డ తార‌స‌ప‌డే అత్యాధునిక‌ ఆర్కిటెక్చర్, విలాసవంతమైన షాపింగ్ అనుభవాలతోపాటు సందర్శకులను వినోదభరితంగా ఉంచడానికి అనేక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ నగరం కౌల‌లంపూర్. ఈ అందాల న‌గ‌రానికి ప్ర‌పంచ‌ఖ్యాతి తెచ్చిపెట్టిన‌ పెట్రోనాస్ ట్విన్ టవర్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఇవి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణాలుగా పేరుపొందాయి. టవర్లపై ఉండే ప్లాట్‌ఫారమ్‌ను చేరుకోవ‌డం ద్వారా నగరం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చేడ‌వ‌చ్చు.

రిత్రాత్మక బటు గుహలు, మెర్డెకా స్క్వేర్, మెనారా కేఎల్‌ టవర్ వంటి ఇతర ముఖ్యమైన‌ ఆకర్షణలు అద‌నం. ప్రకృతిని ఇష్టపడే వారికి, కౌలాలంపూర్ బర్డ్ పార్క్‌తోపాటు అనేక సుందరమైన పార్కులు నగరంలో ద‌ర్శ‌న‌మిస్తాయి. అంతేకాదు, ఈ నగరం ఆహార ప్రియుల స్వర్గధామం వంటిది. మొత్తంగా కౌలాలంపుర్ ప్ర‌యాణం.. చరిత్ర, సంస్కృతి మ‌రియు ఓ సాహస యాత్ర‌గా జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను మిగుల్చుతుంది.

More News

    Read more about: vizag to tour services
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+