రైలు ప్రయాణికులకు శుభవార్త... హైదరబాద్ వాసులు గోవా వెళ్లాలంటే చాలామంది బస్సులోనో, విమానంలోనో వెళ్లాలి. ఎందుకంటే, సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు ట్రైన్స్ అందుబాటులో లేవు. ఉన్న ట్రైన్స్ కూడా గుంతకల్లులో బోగీలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుంది. దీంతో గోవాకు ట్రైన్ ప్రయాణమంటే కాస్త కష్టమనే చెప్పుకోవాలి. గోవాకు నేరుగా ట్రైన్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పర్యాటకుల నుంచి వినిపిస్తున్న మాటలు. అయితే, ఇప్పడు ప్రయాణికులకు ఆ కోరిక నేరెవేరింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా ట్రైన్ పట్టాలెక్కనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి...
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు నేరుగా ట్రైన్ మార్గంలో ప్రయాణించాలంటే హౌరా వాస్కోడిగామా రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకపోతే విజయవాడ నుంచి గుంతకల్లు మీదుగా హుబ్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి మరో రైల్లో వాస్కోడిగామా చేరుకోవాలి. ఈ విధంగా గోవా చేరుకోవాల్సి వచ్చేది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.
హౌరా-వాస్కోడిగామా ట్రైన్ బెర్తులు లభించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మీదుగా వచ్చే ట్రైన్లలో ఏసీ బోగీల్లో ప్రయాణమంటే ఓ నరకంలా ఉంటుందని చెప్పాలి. ఈ ట్రైన్లలో రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఏసీ బోగీల్లోకి కూడా ప్రయాణికులు వచ్చేస్తుంటారు. దీంతో ఈ ట్రైన్లలో తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి.

సుమారు 16గంటలు పైనే ...
విజయవాడ నుంచి వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్ హుబ్లీ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ప్రయాణం సుమారు 16గంటలు పైనే పడుతుంది. మళ్లీ అక్కడి నుంచి వాస్కోడిగామా , మాడ్గవ్ వంటి స్టేషన్లను చేరుకోవాలంటే మరో మూడు నాలుగు గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లాలనుకువారికి ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. గోవాకు నేరుగా కనెక్టింగ్ రైల్లో వెళ్లడం కంటే నైట్ స్లీపర్ బస్సుల్లో ప్రయాణం చేయడం సులువనే చెప్పాలి.
ఈ క్రమంలో ఎప్పటి నుంచో గోవాకు నేరుగా ట్రైన్ ఏర్పాటు చేయాలనే వాదనలు వినిపిస్తూఉన్నాయి. తాజాగా దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ నుంచి డ్రైరెక్టుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా ట్రైన్ సర్వీసును అందుబాటులోకి తీసుకు రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసుగా కాచిగూడ నుంచి నాలుగు బోగీలను వాస్కోడిగామా ట్రైన్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఇందులో రెండు సాధారణ బోగీలు, ఏసీ, స్లీపర్ బోగీలను గుంతకల్లులో గోవా రైలుతో కలిపే వారు.
ఈ వారంలో ట్రైన్ సర్వీస్...
ఈ వారంలో సికింద్రాబాద్ టు గోవా డైరెస్టు సర్వీసును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు వీలుగా ఈ రైలు సమయాలు ఉండేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలో ఏటా 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవా సందర్శనకు వెళుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 15-20లక్షల మంది గోవాను సందర్శిస్తుంటారు. ఇకపై ప్రతి బుధవారం, శుక్రవార్ సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు డైరెక్ట్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. గురువారం, శనివారాల్లో వాస్కోడిగామా, మాడ్గవ్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ట్రైన్ టిక్కెట్ ధరలను అధికారులు త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications













