Search
  • Follow NativePlanet
Share
» » గురుగ్రామ్‌లో మాల్స్ మాత్రమే కాదు.. మ్యూజియంలూ ఉన్నాయి

గురుగ్రామ్‌లో మాల్స్ మాత్రమే కాదు.. మ్యూజియంలూ ఉన్నాయి

గురుగ్రామ్‌లో మాల్స్ మాత్రమే కాదు.. మ్యూజియంలూ ఉన్నాయి

గురుగ్రామ్ పేరు విన‌గానే ఎన్నో అధునాత‌న‌ మాల్స్ లేదా నైట్ లైఫ్ గుర్తుకొస్తుంది. ఇక్కడి విహారం ఖచ్చితంగా ఆనందాన్ని చేరువ‌చేస్తుంది. అయితే, గురుగ్రామ్‌ను ఐటి లేదా బ్యాంకింగ్ హబ్‌గా మాత్ర‌మే చూస్తే స‌రిపోదు. ఎందుకంటే, గురుగ్రామ్ మ‌రెన్నో సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌కు నిల‌యం. ఇక్కడ ఉన్న కొన్ని అత్యుత్తమ మ్యూజియంలు నిత్యం ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

ఈ మ్యూజియంల‌లో అనేక రకాల సమాచారాన్ని పొందవచ్చు. దీంతోపాటు విభిన్న అనుభవాన్ని మ‌న‌సులో మూట‌గ‌ట్టుకోవ‌చ్చు. ఈ మ్యూజియంలు గురుగ్రామ్ యొక్క విభిన్న కోణాన్ని ప్రదర్శించేందుకు దోహ‌దం చేస్తున్నాయి. అందుకే, ఈ కథనంలో గురుగ్రామ్‌లో ఉన్న కొన్ని అత్యుత్తమ మ్యూజియంల గురించి తెలుసుకోబోతున్నాం.

హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం

హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం

గురుగ్రామ్‌లోని హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం చాలా భిన్నమైనది. ఇది 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ నాలుగు-అంతస్తుల మ్యూజియంలో పాతకాలపు మరియు క్లాసిక్ కార్లు మరియు ద్విచక్ర వాహనాలను ప్ర‌ద‌ర్శ‌నకు ఉంచుతారు. అలాగే, ఓల్డ్ మోడ‌ల్‌ బస్సులతోపాటు విమాన నమూనాలను కూడా ఇక్క‌డ చూడొచ్చు. పాత ఆటోమొబైల్ ఫోటోగ్రాఫ్‌లు, పోస్ట్‌కార్డ్‌లు, స్టాంపులు, మ్యాప్‌లు మరియు అరుదైన పుస్తకాల సేకరణ కూడా ఉంది. అరుదైన వ‌స్తు సేక‌ర‌ణ‌తో ఈ మ్యూజియం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటుంది.

మ్యూజియో కెమెరా మ్యూజియం

మ్యూజియో కెమెరా మ్యూజియం

ఇది గురుగ్రామ్‌లోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియంలలో ఒకటి. అంతేకాదు, భారతదేశ ఫోటోగ్రాఫిక్ వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో నిర్మించబడింది. అరుదైన పాతకాలపు కెమెరాల నుండి అందమైన పురాత‌న‌ ఒరిజినల్ ఫోటోగ్రాఫ్‌ల వరకు ఇక్క‌డ చూసే అవకాశం ఉంది. మీకు ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నా, లేకున్నా ఈ మ్యూజియంలో అడుగుపెట్టాక త‌ప్ప‌కుండా ఫోటోగ్ర‌ఫీపై ఆస‌క్తి క‌లుగుతుంది. ఈ మ్యూజియంలో 1000 కంటే ఎక్కువ అన్‌లాగ్ కెమెరాలు ఉన్నాయి. ఈ విభాగం మ్యూజియంలోనే హైలేట్‌గా నిలుస్తుంది.

మూడు మ్యూజియంల కేంద్రం..

మూడు మ్యూజియంల కేంద్రం..

గురుగ్రామ్‌లోని సంస్కృతి మ్యూజియం సెంట్ర‌ల్ కాంప్లెక్స్‌లో ఉంది. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం మూడు మ్యూజియంలు ఉన్నాయి. మ్యూజియం ఆఫ్ ఎవ్రీడే ఆర్ట్, మ్యూజియం ఆఫ్ ఇండియన్ టెర్రకోట మరియు మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్. ఈ మ్యూజియంలన్నీ భారతదేశంలోని విభిన్న సంస్కృతుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. మ్యూజియం ఆఫ్ ఎవ్రీడే ఆర్ట్‌లో భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ జనాభా యొక్క రోజువారీ జీవితాలకు సంబంధించిన వస్తువులను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శిస్తారు. అలాగే, జంతువుల నుండి మానవులు మరియు దేవతల విగ్రహాలు, కుండలు మరియు టెర్రకోటతో చేసిన ఇతర వస్తువులను మీరు ఇండియన్ టెర్రకోట మ్యూజియంలో చూడవచ్చు. అదేవిధంగా, మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్‌లో మీకు వివిధ భారతీయ రాష్ట్రాల గొప్ప వస్త్ర వారసత్వం గురించి తెలియ‌బ‌రిచేలా వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది.

జానపద మరియు గిరిజన కళల మ్యూజియం

జానపద మరియు గిరిజన కళల మ్యూజియం

మీకు సాంప్రదాయ కళల‌పై ఆసక్తి ఉంటే, గురుగ్రామ్‌లో ఉన్న జానపద మరియు గిరిజన కళల మ్యూజియాన్ని తప్పక సందర్శించాలి. కె.సి.ఆర్యన్ చేత స్థాపించబడింది. భారతదేశంలోని జానపద మరియు గిరిజన వర్గాల అరుదైన‌, అంత‌రించిపోతోన్న‌ కళారూపాలు ఈ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఇక్కడ వెండి ఆభరణాలు, పెయింటింగ్‌లు, మెటల్ మరియు చెక్క క్రాఫ్ట్‌లు, లక్ వేర్ మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని ఇత‌ర‌ గిరిజ‌న‌ వస్తువులను చూసే అవకాశం లభిస్తుంది. అంతే కాదు, ఇప్పుడు వాడుకలో లేని లేదా అంతరించిపోయిన కళారూపాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.

More News

    Read more about: gurugram haryana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+