Search
  • Follow NativePlanet
Share
» »ఈ నెల 25 వ‌ర‌కు జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలు మూసివేత‌...

ఈ నెల 25 వ‌ర‌కు జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలు మూసివేత‌...

నిన్న మొన్న‌టివ‌ర‌కు దేశంలో వ‌ర్షాలు దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు దానా తుఫాన్ బంగాళాఖాతం వైపు వేగంగా క‌దులుతున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. దానా తుఫాను ప్ర‌భావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై తీవ్రంగా ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అక్క‌డి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే లోతట్టు ప్రాంతాల నుంచి నివాసితులను ఖాళీ చేయించడం, విద్యా సంస్థలను మూసేయడం వంటి ప‌నులు చేస్తున్నారు.

ఈ తుఫాను ప్ర‌భావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఉంటుంద‌ని స‌మ‌చారం. ఈ దానా తుఫాను ప్రభావం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయ‌ని, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఈ విష‌యంపై అక్కడి ప్రభుత్వాలు కూడా అప్రమత్తమ‌య్యాయి. దానా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. ఇక ఇక్క‌డి స్కూళ్లకు కూడా నాలుగురోజుల పాటు సెలవులు ప్రకటించాయి.

konarksuntemple

ఈ ఆల‌యాలు మూసివేత‌..

'దానా' తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను కూడా మూసివేయ‌నన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్డర్ ప్రస్తుతం ఈ నెల (అక్టోబర్) 25వ తేది వరకు అమలులో ఉండనుంద‌ని అధికారులు వివ‌రించారు. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిర్ణంయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆలయాలు తెర‌వ‌లా వ‌ద్ద అనే నిర్ణయం ప్ర‌భుత్వం తీసుకోనుంది.

ప‌లు మ్యూజియంలు కూడా మూసివేత‌..

ఒడిశా రాష్ట్రంలోని పూరీ లో వెల‌సిన ఈ ఆలయాలను సంద‌ర్శించకునేందుకు నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తుంటారు. జగన్నాథ దేవాలయం, కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పేరుగాంచాయి. ఇక్క‌డికి ప్రతిరోజు భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. తుఫాను సంభవించినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసిన‌ట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేశారు.

lordjagnnath

ప‌లు రైళ్లు కూడా ర‌ద్దు..

'దానా' తుఫాను ఈ నెల (అక్టోబర్) 24వ తేదిన‌ అంటే గురువారం నాడు తీవ్ర తుఫానుగా మారుతుందని అధికారులు తెలిపారు. అదే, అక్టోబర్ 25వ తేదిను ఉదయం వేళ‌ గంటకు 100 నుండి120 కిలోమీట‌ర్ల‌ వేగంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకుతుందని వాతావ‌ర‌ణ శాక భావిస్తోంది. అయితే, ఈ సమయంలో గంటకు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగ గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

దానా తుఫాను కారణంగా, పూరీలోని వాతావరణ శాఖ మత్స్యకారులను హెచ్చ‌రించింది. ఈ స‌మ‌యంలో సముద్రానికి దూరంగా ఉండాలని ప‌లు సూచ‌న‌లు చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా దానా తూఫాను దృష్ట్యా రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఒడిశా, బెంగాల్ మార్గాల్లో ప‌లు రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేసింది. ఇక‌, ఈ తుఫానుకు సంబంధించి అత్య‌వ‌స‌ర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు వందల టన్నుల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలను కూడా పంపించిన‌ట్లు తెలుస్తోంది.

More News

    Read more about: dana typhoon puri news
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+