గోవాలోని ప్రసిద్ధ చర్చ్‌ల గురించి తెలుసుకుందాం
విహారయాత్రా ప్రాంతాలలో గోవాను మరే ప్రదేశం అధిగమించదు. అందమైన తీరప్రాంతాలతో నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు గోవా ఉత్తమ ప్రదేశం. గోవాలో పోర్చుగీస్ ప్రభావం వల్ల నగరం చుట్టూ ప్రార్థనాపరమైన పురాతన నిర్మాణాల కలయిక అదనపు ఆకర్షణ.
ఈ ప్రార్థనా స్థలాలు, నిర్మలమైన వాతావరణాన్ని అందించడంతో పాటు అద్భుతమైన కళాఖండాలు కూడా సందర్శకులను ఆహ్వానిస్తాయి. అందుకే గోవా చుట్టూ ఉన్న అద్భుతమైన చర్చ్‌ల గురించి తెలుసుకుందాం.

Se కేథడ్రల్
Se కేథడ్రల్ డి శాంటా కాటరినా వెల్హాలో ఉన్న ఒక పురాతన చర్చ్. గోవాను స్వాధీనం చేసుకోవడంలో పోర్చుగీస్ సైన్యం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దీనిని నిర్మించారు. అద్భుతమైన వెలుపలి భాగంతో పోర్చుగీస్-మాన్యులైన్ డిజైన్‌లో నిర్మించబడిన ఈ చర్చి లోపల రాజసం ఉట్టిపడే ఆకృతి దర్శనమిస్తుంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన గోల్డెన్ బెల్‌తోపాటు మనఃశాంతిని కోరుకునే ఏ యాత్రికులైనా ఈ చర్చ్‌ని తప్పక సందర్శిస్తారు.

సెయింట్ కాజేటన్ చర్చ్
ఈ మిరుమిట్లు గొలిపే నిర్మాణం ఓల్డ్ గోవాలోని వెల్హాలోని ఐకానిక్ వైస్రెగల్ ప్యాలెస్ సమీపంలో ఉంది . గోవాలో ఇదొక ప్రసిద్ధ చర్చ్. ఈ చర్చ్ కొరింథియన్ డిజైన్‌లో నిర్మించబడింది. వారి వ్యవస్థాపకుడు సెయింట్ కాజేటన్ పేరు దీనికి పెట్టారు. మేరీ ముందు మోకరిల్లడానికి ప్రధాన పీఠం కాకుండా, పక్కనే మరో ఆరు పీఠాలు ఉంటాయి. మహిమాన్వితమైన ప్రదేశంగా పేరొందిన ఈ చర్చ్ ఖచ్చితంగా చూడదగిన ప్రాంతం.

బోమ్ జీసస్ బసిలికా
యునెస్కో ప్రకటించిన ఈ హెరిటేజ్ సైట్‌ను చూడాలనుకునే సందర్శకులతో నిత్యం రద్దీగా ఉంటుంది. గోవాలోని ఓల్డ్ గోవా రోడ్‌లో ఉన్న బోమ్ జీసస్ బాసిలికా బరోక్ శైలిలో నిర్మితమైన మతపరమైన నిర్మాణం. ఈ చర్చ్‌లో సర్రియలిస్ట్ కళాకారుడు డోమ్ మార్టిన్ చేసిన అద్భుతమైన పని తీరు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాకుండ, ఇక్కడ ప్రదర్శనలో ఉన్న శవపేటిక అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి
పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ అద్భుతమైన నిర్మాణం వెల్హాలో ఉంది. ఇది సెయింట్ అస్సిసి జీవితాన్ని గోడలపై కుడ్యచిత్రాలుగా వర్ణించే బరోక్ డిజైన్‌లతో నిర్మించబడింది . ఈ చర్చ్‌ని అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించడానికి మరొ కారణం ప్రక్కనే ఉన్న మ్యూజియం. సందర్శకులు వీక్షించడానికి వివిధ కళాఖండాల సమ్మేళనం వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది.

నోస్సా సెన్హోరా డి పెన్హా డి ఫ్రాంకా
పంజిమ్‌లో ఉన్న నోస్సా సెన్హోరా డి పెన్హా డి ఫ్రాంకా చర్చి నోస్సా సెన్హోరా కోసం నిర్మించబడింది. అతను సముద్ర ప్రయాణంలో ప్రమాదాల నుండి నావికులను రక్షించాడని నమ్ముతారు. ఈ చర్చ్ అద్భుతమైన హస్తకళ మరియు ప్రశాంతమైన వాతావరణంతో, నోస్సా సెన్హోరా కోసం నిర్మించిన ఐదు చర్చ్‌లలో ఒకటి. ఇక్కడికి వచ్చే సందర్శకుల చూపు తిప్పుకోనీయని నిర్మాణశైలి ఈ చర్చ్ సొంతం.



Click it and Unblock the Notifications













