Search
  • Follow NativePlanet
Share
» »మిలాన్ 2024 : విశాఖ వేదిక‌గా నౌకాద‌ళ విన్యాసాల‌కు స‌ర్వం సిద్ధం

మిలాన్ 2024 : విశాఖ వేదిక‌గా నౌకాద‌ళ విన్యాసాల‌కు స‌ర్వం సిద్ధం

ప్ర‌పంచ దేశాల నౌకాద‌ల విన్యాసాలు మిలాన్ 2024కు మ‌రోసారి విశాఖ వేదికగా నిలిచింది. తూర్పు నౌకాద‌ల ఆధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి తొమ్మిది రోజులపాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. వేడుక‌ల్లో భాగంగా గ‌గ‌న త‌లంలో ఫైట‌ర్‌ జెట్‌లు, హెలికాఫ్ట‌ర్ల విన్యాసాల‌తో ఆక‌ట్టుకోనున్నాయి. అమెరికా, ర‌ష్యా, ఇరాన్, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, ద‌క్షిణ కొరియా, ఇండోనేషియా, మ‌లేషియా ఇలా యాభై దేశాల‌కు చెందిన నౌకాద‌ళాలు మిలాన్‌లో పాల్గొన‌నున్నాయి.

విశాఖ తీరం నౌకాద‌ళ విన్యాసాల‌తో న‌గ‌రవాసుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలను ఆక‌ర్షంచిన‌ విశాఖ మహా నగరం.. మ‌రోసారి ప్రతిష్టాత్మక మిలాన్‌-2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే మిలాన్‌ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.
మిలాన్‌ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌ను ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు.

నిజానికి, మిలాన్‌-2024 విన్యాసాలను 'కమరడెరీ(స్నేహం)-కొహెషన్‌ (ఐక్యత)-కొలాబరేషన్‌(సహకారం)' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. విశాఖ సాగ‌ర తీరంలో మొత్తంగా మిలాన్ విన్యాసాలు రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. హార్బ‌ర్ ఫేజ్‌లో భాగంగా ఈ నెల 23 వ‌ర‌కూ వివిధ దేశాల మ‌ధ్య సాంస్కృతిక భాగ‌స్వామ్య ప్రోత్స‌హించ‌డానికి సిటీ ప‌రెడ్, ఎగ్జిబిష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. సీ ఫేజ్‌లో భాగంగా 24 నుంచి 27 వ‌ర‌కూ భారీ విన్యాసాలు, అధునాత‌న ర‌క్ష‌ణ చ‌ర్య‌లు, యాండీ స‌బ్ మెరేన్ వార్ ఫెయిర్ నిర్వ‌హిస్తారు. ఐఎంఎస్ విక్రాంత్‌, ఐఎంఎస్ విక్ర‌మాదిత్య స‌హా భార‌త నౌకాధ‌ళానికి చెందిన 20 యుద్ధ‌నౌక‌లు, వివిధ నౌకాదళాల‌కు చెందిన యుద్ధ‌ విమానాలు పాల్గొంటాయి.

visakhapatnamallsetfornavalexercises

ఆక‌ట్టుకోనున్న విన్యాసాలు..

21న సుముద్రిక నేపల్ ఆడిటోరియంలో ప్రారంభోత్స‌వం, 22న ఆర్‌కే బీచ్‌లో కవాతు నిర్వ‌హిస్తారు. ఇప్ప‌టికే మిలాన్ విన్యాసాల కోసం చేప‌ట్టిన రిహార్స‌ల్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. భారీ యుద్ద నౌక‌లు, స్పీడ్ బోట్‌లు, ఫైట‌ర్ జెట్స్, పారాచూట్‌ల‌తో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు న‌గ‌ర వాసుల‌ను ఆక‌ర్షించాయి. ప్ర‌మాదంలో చిక్కుకున్న‌వారిని హెలీకాఫ్ట‌ర్ ద్వారా ర‌క్షించ‌డం, తీవ్ర‌వాద దాడుల‌ను ఎదుర్కోవ‌డానికి ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం యుద్ధ నౌక‌లు ఒక‌దానిపై మ‌రొక‌టి బాంబుల వ‌ర్షం కురిపించుకున్నాయి.

visakhapatnamallsetfornavalexercises

వివిధ పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్నాయి. జాతీయ గీతాల‌కు త‌మ‌దైన శైలిలో నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శ‌న చేసి చిన్నారులు అల‌రించారు. భారీ క‌వాతు వివిధ భ‌ద్ర‌తా బ‌ల‌గాల ప్ర‌ద‌ర్శ‌న‌లు మైమ‌ర‌పించాయి. ఈ నెల 22న మిలాన్ 2024 హార్బ‌ర్ ఫేజ్ తుది విన్యాసాలు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్య అతిథిగా ఉప‌రాష్ట్ర‌ప‌తి, సీఎం జ‌గ‌న్ హార్బ‌ర్ ఫేజ్ తుది విన్యాసాల‌ను తిల‌కిస్తారు.

ప‌టిష్ట ఏర్పాట్లు..

మిలాన్ 2024 వేడుక‌ల సంద‌ర్భంగా అధికారులు ప‌టిష్ట ఏర్పాట్లు చేశారు. వేడుక‌ల‌ను వీక్షించేందుకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. బీచ్ రోడ్డులో 30 ఎన్‌క్లోజ‌ర్‌లు, 30 స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌రో వైపు రేప‌టి నుంచే బీచ్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌లుకానున్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+