Search
  • Follow NativePlanet
Share
» »అబుదాబిలోని హిందూ దేవాల‌యాన్ని ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ..

అబుదాబిలోని హిందూ దేవాల‌యాన్ని ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ..

ఒకవైపు అయోధ్యలో చారిత్రక రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో యావత్ ప్రపంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి నగరంలో కూడా చరిత్ర సృష్టించబోతోంది. అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. ఈ ఆల‌య ప్రారంభానికి భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ఆహ్వానించ‌డం జ‌రిగింది. అందుకు ఆయ‌న కూడా ఒప్పుకున్నారు.

అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం, భారతదేశం వెలుపల అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా, పశ్చిమ ఆసియాలో అత్యంత అద్భుతమైన హిందూ దేవాలయంగా ఏర్పాటు చేయడం జ‌రిగింది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయం ప్రముఖ స్వామి మహారాజ్, BAPS స్వామినారాయణ్ సంస్థ, మహంత్ స్వామి మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక సాధువుల ఆశీర్వాదం ద్వారా ప్రేరేపించ‌బ‌డింది. ఈ ఆలయాన్ని భారతదేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారులు మాత్రమే నిర్మించారు. ఈ ఆలయం కేవలం దేవాలయంగా మాత్రమే కాకుండా అబుదాబిలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శక్తివంతమైన ప్రదేశంగా కూడా పేరు పొందుతుంది. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14, 2024న ప్రారంభించ‌నున్నారు.

ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిసినది ఉండ‌నుంద‌ని హిందూ మందిర్ ప్రతినిథులు అంటున్నారు. ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ప్రాణం పోసుకుంటున్న ఈ ఆలయం వచ్చే నెల ఫిబ్రవరి 18 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానుంది. అలాగే ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు మందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

hindutempleabhudhabi1

ఈ ఆల‌య ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసుకుందాం

- అబుదాబి యొక్క BAPS హిందూ దేవాలయం మధ్యప్రాచ్యంలో చారిత్రక చిహ్నంగా ఉద్భవించనుంది.
- ఈ ఆలయం భారతదేశంలో నిర్మించిన సాంప్రదాయ రాతి దేవాలయాల వలె రూపొందించబడింది.
- ఈ ఆలయం గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించబడింది. దీని రూపకల్పన శిల్పశాస్త్రం, సంస్కృత గ్రంథాల వాస్తుశిల్పం ఆధారంగా తయారు చేయడం జ‌రిగింది.

- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఈ ఆలయం సాంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మించబడింది.

- UAEలోని 7 ఎమిరేట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆలయంలో 7 గోపురాలు నిర్మించబడ్డాయి.
- ఈ 7 గోపురాలే కాకుండా, ఆలయం దాని వైభవాన్ని పెంచే 5 అలంకార‌మైన గోపురాలు కూడా ఉన్నాయి. ఈ ఆల‌యం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది.

- సందర్శకుల కేంద్రం, ప్రార్థన గది, ప్రదర్శనలు, ప్రత్యేక అభ్యాస ప్రదేశం, పిల్లల కోసం ఆట స్థలం, వివిధ థీమ్‌ల ఆధారంగా తోటలు, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్ట్, బుక్, గిఫ్ట్ షాప్ వంటి వాటిని కూడా ఆలయంలో నిర్మించబడ్డాయి.

- దీపావళి, గోవర్ధన్ పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వ‌హిస్తారు. అందువల్ల పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

- ఈ ఆలయం భారతదేశం, UAE మధ్య సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.

- UAEలో నిర్మించిన BAPS హిందూ దేవాలయం యొక్క తలుపులు అన్ని మ‌తాల వారికోసం తెర‌వ‌బ‌డ‌తాయి.

అబుదాబిలోని ఈ అద్భుతమైన ఆలయానికి ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ అహ్యాన్ స్థ‌లాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయం 14 ఫిబ్రవరి 2024న ప్రారంభించబడుతుంది. అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయాన్ని భారత‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించనున్నారు. 27 ఎక‌రాల స్థ‌లంలో ఈ ఆల‌యం విస్త‌రించ‌నుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+