Search
  • Follow NativePlanet
Share
» » బుద్ధుడు త‌న‌ మొద‌టి ఉప‌దేశం ఇచ్చిన ప్ర‌దేశం సార‌నాథ్‌!

బుద్ధుడు త‌న‌ మొద‌టి ఉప‌దేశం ఇచ్చిన ప్ర‌దేశం సార‌నాథ్‌!

బుద్ధుడు త‌న‌ మొద‌టి ఉప‌దేశం ఇచ్చిన ప్ర‌దేశం సార‌నాథ్‌!

భారతదేశంలోని బుద్ధగయ, కుషీనగర్ మరియు నేపాల్‌లోని లుంబినితో పాటు ప్రపంచంలోని నాలుగు ముఖ్యమైన బౌద్ధ యాత్రా స్థలాలలో ఒకటి సారనాథ్. బుద్ధుడు తన మొదటి ఉప‌దేశం ఇచ్చిన ప్రదేశం కనుక దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సందర్శించేందుకు బౌద్ధులే కాన‌వ‌స‌రంలేదు. సారనాథ్ వారణాసి నుండి ఓ మంచి రిఫ్రెష్ ట్రిప్‌ను చేరువ‌ చేస్తుంది.

సారనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఈశాన్యంగా ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. ధమేఖ్ స్థూప సముదాయం ఇక్క‌డి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవ‌చ్చు. ఇది ల్యాండ్‌స్కేప్డ్ పార్క్‌లో సంరక్షించబడుతోంది. బుద్ధుడు తన మొదటి ఉప‌దేశం ఇచ్చాడని విశ్వసించబడే ప్రదేశంలోని ధమేఖ్ స్థూపం, బౌద్ధ ఆరామాలు, అశోక స్తంభం మరియు ధర్మరాజిక స్థూపం యొక్క అవశేషాలు ఇక్క‌డ చూడొచ్చు. ఈ కాంప్లెక్స్ ప్రతిరోజూ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. లోప‌ల‌కు వెళ్లేందుకు విదేశీయులు టిక్కెట్‌ల ధర 300 రూపాయలు, భారతీయులు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ బౌద్ధ దేశాలకు చెందిన ఆధునిక దేవాలయాలు మరియు మఠాలు పట్టణం చుట్టూ ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది ములగంధ కుటి విహార్. సారనాథ్‌లో బుద్ధుడు కూర్చుని ధ్యానం చేశాడని చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం గౌరవార్థం శ్రీలంక మహాబోధి సొసైటీ దీనిని 1931లో నిర్మించింది. ఇది ప్రతిరోజూ ఉదయం 4 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

సారనాథ్ పురావస్తు మ్యూజియం

సారనాథ్ పురావస్తు మ్యూజియం

సార‌నాథ్‌లో మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా కొత్త హైటెక్ సౌండ్ అండ్ లైట్ షో 2020లో ప్రారంభించబడింది. ధమేఖ్ స్థూపం వద్ద ఉన్న పార్క్‌లో ప్రతిరోజూ సాయంత్రం 7.30 నుండి 8 గంటల వరకు షో జరుగుతుంది. ఇది ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ యొక్క గంభీర‌మైన వాయిస్‌లో బుద్ధుని జీవితం మరియు బోధనలను వివరిస్తుంది. ఇక్క‌డి ఆకర్షణీయమైన సారనాథ్ పురావస్తు మ్యూజియంలో ధమేఖ్ స్థూప సముదాయం పక్కన, 3వ శతాబ్దం BC నుండి 12వ శతాబ్దం AD నాటి ఆసక్తికరమైన కళాఖండాలు, అశోక స్తంభం యొక్క ఆకట్టుకునే పైభాగం హైలైట్‌గా నిలుస్తాయి. మ్యూజియం శుక్రవారాలు తప్ప ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. విదేశీయులు మరియు భారతీయులకు టిక్కెట్ల ధర 5 రూపాయలు మాత్ర‌మే. ఫోటోగ్రఫీకి మాత్రం అనుమ‌తి ఉండ‌దు.

అందుబాటులో గైడ్‌లు

అందుబాటులో గైడ్‌లు

సార‌నాథ్‌లోని స్మారక చిహ్నాల చరిత్ర యొక్క వివరణాత్మక వివరణ కోసం అయితే మాత్రం గైడ్‌ల స‌హాయం తీసుకోవ‌డం మంచిది. స్థానికంగా గైడ్‌లు నిత్యం అందుబాటులో ఉంటారు. ఈ ప్ర‌దేశం విశిష్ట‌త‌ను తెలిపేందుకు వంద రూపాయ‌ల‌కంటే త‌క్కువే తీసుకుంటారు. లేదా ప్రత్యామ్నాయంగా భారతీయ రైల్వే యొక్క ప్రత్యేక మహాపరినిర్వాన్ ఎక్స్‌ప్రెస్ బౌద్ధ సర్క్యూట్ రైలు ప్రయాణం ద్వారా సారనాథ్ చేరుకుని, ఇక్క‌డి విశేషాల‌ను తెలుసుకోవ‌చ్చు.

సారనాథ్‌ని ఎలా సందర్శించాలి

సారనాథ్‌ని ఎలా సందర్శించాలి

వార‌ణాసి నుంచి ఇక్క‌డ‌కు సుల‌భంగా చేరుకోవ‌చ్చు. ఆటో కోసం దాదాపు 200-300 రూపాయలు మరియు టాక్సీకి 400-500 రూపాయలు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి చౌకైన బస్సులు మరియు షేర్‌ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్క‌డ‌కు చేరుకున్నాక‌.. ఇక్క‌డి చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను ద‌గ్గ‌ర‌గా చూడాలంటే మాత్రం సైకిల్‌ను అద్దెకు తీసుకోవడం మంచిది.

More News

    Read more about: bodh gaya kushinagar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+