Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో షిల్లాంగ్ చూడాల్సిందే..

వ‌ర్షాకాలంలో షిల్లాంగ్ చూడాల్సిందే..

వ‌ర్షాకాలంలో షిల్లాంగ్ చూడాల్సిందే..!

కొత్త‌రూపును సంత‌రించు కుంటుంది. మ‌రీ ముఖ్యంగా స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్‌గా పిలుచుకునే షిల్లాంగ్ నూత‌న సోయ‌గాల‌తో ముస్తాబై, ప్ర‌కృతి ప్రేమికుల‌ను రా.. ర‌మ్మ‌ని ఆహ్వానిస్తుంది. ఒవైపు విన‌సొంపైన జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు.. మ‌రోవైపు ఈశాన్య భార‌త సంస్కృతిని ప‌రిచ‌యం చేసే మ్యూజియంలు సంద‌ర్శ‌కుల మ‌న‌సును ఆద్యంతం క‌ట్టిప‌డేస్తాయి. మ‌రెందుకు ఆల‌స్యం షిల్లాంగ్ ప‌రిస‌రాల‌ను చుట్టేద్దాం ప‌దండి!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. ఈశాన్య భార‌తం ప‌చ్చ‌ద‌నంతో

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. ఈశాన్య భార‌తం ప‌చ్చ‌ద‌నంతో

ఈశాన్య భార‌త‌దేశంలోని మేఘాల‌య రాష్ట్ర రాజ‌ధాని షిల్లాంగ్‌. త‌క్కువ ఎత్తులో ఉన్న కొండ‌ల వ‌రుస‌పై విస్త‌రించి ఉన్న ప‌ర్వ‌త ప‌ట్ట‌ణంగా దీనిని చెప్పుకొవ‌చ్చు. ఇది స‌ముద్ర మ‌ట్టానికి 1520 మీట‌ర్ల (4,990 అడుగుల‌) ఎత్తులో ఉంది. వ‌ర్షాకాల‌పు ప‌ర్యాట‌క‌ కేంద్రంగా పేరుపొంద‌డంతోపాటు దీనిని స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్ గా పిలుస్తారు. అందుకే, ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే ఇక్కడ ఉండే ప్రకృతి సోయగాలకు, జలపాతాలకు ఫిదా అయిపోతారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే వారు మృదుస్వభావులు. ఖాతీ, జైంతియా తెగ‌లవారు ఇక్క‌డ జీవిస్తారు. ఈ ప్రాంతం సంద‌ర్శ‌న‌కు వచ్చి విహరించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్త‌యిన పైన్ వృక్షాలు ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను రెట్టింపు చేస్తాయి.

పొందాలంటే.. క‌నులారా చూడాల్సిందే

పొందాలంటే.. క‌నులారా చూడాల్సిందే

షిల్లాంగ్ శిఖరం పైనుంచి పరిసరాల పచ్చదనాన్ని తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం, పరిసర ప్రాంతాలు చక్కగా కనిపిస్తాయి. ఎలిఫెంట్ జలపాతం, స్ప్రెడ్ ఈగల్ జలపాతం, స్వీట్ జలపాతం, క్రినోలిన్ జలపాతాల సవ్వ‌డులు ప‌ర్యాట‌కుల‌ను ప్ర‌కృతి ఒడిలో సేద‌దీరేలా చేస్తాయి. ఆ అనుభూతి పొందాలంటే ఉరకలేసే ఈ జలపాతాల సొగసును క‌ళ్లారా చూసి తీరాల్సిందే. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన‌ కెప్టెన్ విలియమ్సన్ సంగ్మా స్టేట్ మ్యూజియం, డాన్బాస్కో ఆదిమ సంస్కృతుల మ్యూజియంలలో ఈశాన్య సంస్కృతికి సంబంధించిన రకరకాల పురాతన వస్తువులను చూడవచ్చు. ఎంటమాలజీ మ్యూజియంలో రంగురంగుల సీతాకోకలు, అరుదైన కీటకాలను తిలకించవచ్చు. లేడీ హైదరీ పార్కు నందనవనాన్నే తలపిస్తుంది. ఈ పార్కులోనే ఉన్న ఫారెస్ట్ మ్యూజియంలో అటవీ సంపదకు సంబంధించిన అరుదైన వస్తువులను తిలకించవచ్చు. ఎగువ షిల్లాంగ్లో ఎయిర్ఫోర్స్ మ్యూజియం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి వార్డ్స్ లేక్, ఉమియమ్ లేక్ వంటి సుందర సరోవరాలు బాతులు, కొంగలు వంటి పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు.

గలవారిని ఆకట్టుకునేలా..

గలవారిని ఆకట్టుకునేలా..

షిల్లాంగ్ పీక్ పెకైక్కి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఉరకలేసే జలపాతాల వద్ద ఉత్సాహంగా, ఉల్లాసంగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఇక్క‌డి కొండలు, గుట్టలు స్వ‌ర్గ‌ధామంగా క‌నిపిస్తాయి. అలాగే, కుటుంబ స‌మేతంగా స్థానిక సరస్సుల్లో బోటు షికార్లు చేయవచ్చు. ఈశాన్య సంస్కృతి, ఇక్కడి ఆదిమ తెగలు, అరుదైన జీవజాతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఇక్కడి మ్యూజియంను చూసి తీరాల్సిందే. షిల్లాంగ్ శివార్లలోనే దట్టంగా విస్తరించి ఉన్న మాఫ్లాంగ్ అరణ్యంలో వనవిహారం చేయవచ్చు. ఈ అరణ్యాన్ని 'సేక్రెడ్ ఫారెస్ట్' (పవిత్రారణ్యం) అంటారు. షిల్లాంగ్‌లోని పురాతన మహాదేవ్ ఖోలా ధామ్ శైవక్షేత్రం, కేథలిక్ కెథడ్రల్, ఆల్ సెయింట్స్ చర్చి వంటివి ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. ఇక క్రిసాలిస్ ఆర్ట్ గ్యాలరీని కళాభిమానులు చూసి తీరాల్సిందే. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+