Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌రంలో తొలి డ‌బుల్‌డెక్క‌ర్ కారిడార్‌కు నేడు సీఎం శంకుస్థాప‌న‌..

భాగ్య‌న‌గ‌రంలో తొలి డ‌బుల్‌డెక్క‌ర్ కారిడార్‌కు నేడు సీఎం శంకుస్థాప‌న‌..

భాగ్య‌నగరం అంటేనే ట్రాఫిక్‌కు మారు పేరుగా మారిపోయింది. ఎన్ని ఫ్లైఓవ‌ర్ల వ‌చ్చినా రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. దీంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించేందుకు తెలంగాణ స‌ర్కార్ ఓ స‌రికొత్త ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది. భాగ్య‌న‌గ‌రంలోనే తొలి డ‌బుల్‌డెక్క‌ర్ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం స‌ద్ధం చేసింది. సీఎం రేవంట్ రెడ్డి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సం నేడు (మార్చి 9) జ‌ర‌గ‌నుంది.

భాగ్య‌న‌గ‌రంలో ఇప్ప‌టికే మెట్రో, హైవే కారిడార్‌వంటివెన్నీనిర్మించినా ట్రాఫిక్ మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వం ట్రాఫిక్ స‌మ‌స్య‌ను నివారించేందుకు కొత్త ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాసులు వంటివెన్నో నిర్మించింది. అయినా, ఇక్క‌డి ట్రాఫిక్‌లో మాత్రం ఎలాంటి మార్పు క‌నిపించడం లేదు. దీంతో తెలంగాణ‌ కొత్త ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నెల‌క్రితం ట్రాఫిక ర‌ద్దీపై ఓ స‌మీక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ర‌ద్దీని త‌గ్గించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారులకు ప‌లు సూచ‌న‌లు కూడా చేశారు.

deckercorridorinbhagyanagaram

సుమారు 5.320 కిలోమీట‌ర్ల కారిడార్‌..

ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌య్యింది. అందుకోసం జాతీయ ర‌హ‌దారిపై డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్ నిర్మాణానికి నేడు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. ఎన్‌హెచ్‌-44పై రూ.1,580 కోట్ల వ్య‌యంతో ఈ కారిడారి నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్నారు. ఇది సుమారు 5.320 కిలోమీట‌ర్ల ఉంటుంది. ఈ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నేడు కండ్లకోయ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ఈ కారిడార్‌పై త‌ర్వాత మెట్రో మార్గం కూడా నిర్మించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ర‌కంగా భాగ్యన‌గరంలో మొద‌టి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌కు నేడు(మార్చి9న‌) సీఎం చేతుల‌మీదుగా శంకుస్థాపన కార్య‌క్ర‌మం జరగనుంది.

ఈ ఎలివేటేడ్ కారిడార్‌పై 131 స్తంభాలు ఉంటాయి..

ఈ డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్ ఎన్‌హెచ్‌-44పై సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి మొద‌లై తాడ్‌బంద్ జంక్షన్, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వరకు ఉంటుంది. ఇది సుమారు 5.320 కిలోమీట‌ర్ల పొడవు ఉంటుంది. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఎలివేటెడ్‌ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యార‌డైజ్‌ జంక్షన్ మీదుగా రోజుకు స‌గ‌టున 1,57,105 వాహ‌నాలు, ఓఆర్‌ఆర్‌ జంక్షన్ స‌మీపంలో 72,687 వాహ‌నాలు ప్ర‌యాణం సాగిస్తున్నాయి.

double-deckercorridorinbhagyanagaram

ఇది ఇరుకైన ర‌హ‌దారి కావ‌డం, భారీగా వాహ‌న రాక‌పోక‌ల‌తో.. నిత్యం వాహ‌న‌దారులు, ఆయా ప్రాంతాల ప్రజ‌లు అవ‌స్థలు ప‌డుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో స‌మ‌యంతో పాటు ఇంధ‌న వ్యయం, ప్రమాదాల సంఖ్య త‌గ్గనుందని అధికారులు భావిస్తున్నారు. అండ‌ర్ గ్రౌండ్ ట‌న్నెల్ 0.600 కిలోమీట‌ర్లు ఉండ‌నుంది. ఈ కారిడార్ కోసం మొత్తం 131స్తంభాలు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్‌ను మొత్తం ఆరు వ‌రుస‌ల్లో నిర్మిస్తారు.

వీటికి ఇరువైపులా అంటే బోయిన‌ప‌ల్లి జంక్ష‌న్ స‌మీపంలో రెండుచోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఈ ర్యాంపులు ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ఉంటాయి. ఈ కారిడార్ పూర్త‌యిన త‌ర్వాత దీనిపై మెట్రో మార్గం కూడా నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌స్తే మాత్రం.. భాగ్య‌న‌గ‌ర‌వాసుల ట్రాఫిక్ కష్టాలు చాలా వ‌ర‌కూ తీరుతాయ‌ని నిపుణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+