Search
  • Follow NativePlanet
Share
» »ప‌శ్చిమ‌బెంగాల్‌లో జ‌న‌వ‌రి 17న వ‌ర‌కు కొన‌సాగ‌నున్న గంగాసాగ‌ర్ జాత‌ర‌..

ప‌శ్చిమ‌బెంగాల్‌లో జ‌న‌వ‌రి 17న వ‌ర‌కు కొన‌సాగ‌నున్న గంగాసాగ‌ర్ జాత‌ర‌..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గంగాసాగర్ జాతర జనవరి 8 వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాతరను ప్రారంభించ‌డం జ‌రిగింది. దీంతో కోల్‌కతాలోని పలు ఘాట్‌లకు సాధువులు, సన్యాసులు, నాగ సాధువులతో పాటు భక్తులు రావడం మొద‌ల‌య్యింది. జ‌నవరి 15వ తేది మకర సంక్రాంతి సంద‌ర్భంగా ఈ జాత‌ర‌ను వీక్షించేందుకు సుమారు 35 నుండి 40 లక్షల మంది భక్తులు త‌ర‌లివ‌స్తారు. కోల్‌కతాకు 123 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సాగర్ద్వీపానికి చేరుకునే అవకాశం ఉంది.

ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను నిర్వ‌హించింది. జాతర ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, సన్యాసులు బస చేసేందుకు వివిధ సంస్థలు సేవా శిబిరాలను కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ సేవా శిబిరాల్లో నివసించడానికి టెంట్లు, ఆహారం, పానీయాల కోసం పూర్తి ఏర్పాట్లు చేయబడ్డాయి. జాతర ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 వేల తాత్కాలిక మరుగుదొడ్లకు ఏర్పాట్ల‌ను కూడా చేసింది.

gangasagarfair , west bengal

సాగర్ద్వీప్ చేరుకోవడం ఎలా..

సాగర్ద్వీప్ కోల్‌కతా నుండి సుమారు 123 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇది రైలు, రోడ్డు మార్గాల ద్వారా కోల్‌కతాతో అనుసంధానించబడి ఉంది. కోల్‌కతా నుండి సాగర్‌ద్వీప్‌కు వెళ్లే మార్గం కొంచెం వంగి ఉంటుంది. కోల్‌కతా నుండి క్యాబ్ లేదా బస్సులో ముందుగా కాక్‌ద్వీప్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం గంగాసాగర్ నుండి దాదాపు 35.5 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. కోల్‌కతాలోని బాబుఘాట్ లేదా ఎస్ప్లానేడ్ బస్ టెర్మినల్ నుండి కాక్‌ద్విప్‌కి నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. కోల్‌కతా నుండి కాక్‌ద్వీప్ చేరుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.

ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం అద‌న‌పు బ‌స్సులు..

అంతేకాదు, వీటితో పాటు ఇక్క‌డ వ‌స‌తి మరియు ఆహారం కోసం మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తిగా ఉచితంగా అందించ‌బ‌డుతున్నాయి. ఈ సంస్థలతో నిరంతరం సన్నిహితంగా ఉండాలి. ఈ జాత‌ర సంద‌ర్భంగా రైలు, బస్సు సర్వీసులను కూడా పెంచారు. గంగాసాగర్ జాతర జనవరి 8 నుంచి జ‌న‌వ‌రి 17 వరకు కొనసాగుతుంది. అందువల్ల, జనవరి 11 మరియు జనవరి 17 మధ్య సాగర్ద్వీప్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. రాష్ట్ర రవాణా సంస్థ‌, సౌత్ బెంగాల్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా గంగాసాగర్ జాతర కోసం మొత్తం 75 అదనపు బస్సులను న‌డుపుతోంది. ఈ బస్సులన్నీ బాబుఘాట్, హౌరా బస్టాండ్ నుండి లాట్-8 (కాక్ద్వీప్) ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతాయి. హౌరా స్టేషన్ నుండి నమ్‌ఖానా లేదా లాట్-8కి ప్రభుత్వ బస్సులో రూ.55 ఛార్జీ ఉంటుంది.

వీటిలో జనవరి 13 నుంచి జనవరి 17 మధ్య గరిష్టంగా బస్సులు నడపనున్నారు. అంతే కాకుండా, రాష్ట్ర రవాణా సంస్థ లాట్-8 నుండి కచుబెరియా వరకు, నమ్‌ఖానా నుండి చెమగురి వరకు ప్రత్యేక లాంచీలు, నౌకలను కూడా నడుపుతుంది. తూర్పు రైల్వేలోని సీల్దా డివిజన్ జనవరి 12, జనవరి 17 మధ్య యాత్రికుల సౌకర్యార్థం సాధారణ మార్పులతో రైళ్లను నడపాలని యోచిస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+