Search
  • Follow NativePlanet
Share
» »ఆసియాలోనే అతిపెద్ద గ్రంథాల‌యం మ‌న‌దేశంలోనే..

ఆసియాలోనే అతిపెద్ద గ్రంథాల‌యం మ‌న‌దేశంలోనే..

ఆసియాలోనే అతిపెద్ద గ్రంథాల‌యం మ‌న‌దేశంలోనే..

ప్ర‌సుత్తం ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఈ మొబైల్స్ వచ్చిన తరువాత పుస్తకాలు చదవడం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ఇక లైబ్రెరీల‌కు వెళ్లే ఊసేలేదు. క్ర‌మంగా లైబ్రైరీలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ప్రముఖ రచయిత కందుకూరి వీరేశలింగం చెప్పిన మాటలు గుర్తే ఉంటాయి. అయినా ఇప్పటికే అక్కడక్కడా కొన్న గ్రంథాలయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే ఆసియాలోనే అతిపెద్ద లైబ్ర‌రీ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఎక్క‌డ ఉందో తెలుసా.. భార‌త్‌లోనే ఉంది.

పురాతన‌ కట్టడాలు, అతి ప్రాచీన వస్తువులను భద్రపరిచే మ్యూజియంలు మనదేశంలో చాలానే ఉన్నాయి. వాటి గురించి చాలా సంద‌ర్భాల్లో విని ఉంటారు. చ‌దివింటారు కూడా. కానీ ఆసియా ఖండంలోనే అతి పెద్ద గ్రంథాల‌యం మ‌న‌దేశంలోనే ఉంద‌నే సంగ‌తి మీకు తెలుసా... ఆ గ్రంథాల‌య చ‌రిత్ర ఏంటో తెలుసుకుందాం..

thelargestlibraryinasia

అర‌వై వేల పుస్త‌కాలు..

ఆసియాలోనే అతిపెద్ద గ్రంథాలయంగా పేరు ప్ర‌ఖ్యాతలు పొందిన ఈ లైబ్రరీ పేరు రాజా లైబ్రరీ. ఈ గ్రంథాల‌యం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉంది. ఇది ఎంతో పురాత‌న‌మైన గ్రంథాలయం. ఈ లైబ్ర‌రీని 1774లో నవాబ్ ఫైజుల్లా ఖాన్ ప్రారంభించారు. 115 ఏళ్ల నుంచి ఈ గ్రంథాల‌యంలోని బల్బులు ఇంకా ప‌నిచేస్తూ ఉండ‌డం ఒకింతా ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. ఇది లైబ్రరీ అనడం కంటే ఒక విజ్ఞానా భాండాగారం అంటే బాగుంటుంది. ఈ గ్రంథాల‌యం భవనం ప్రారంభించిన తొలినాళ్లలో నవాబ్ ఫైజుల్లా ఖాన్ వ్యక్తిగత పుస్తకాల సేకరణను మాత్రమే ఇక్క‌డ ఉండేది. ఆ త‌ర్వాత ఈ గ్రంథాల‌యం ప్రపంచంలోని అరుదైన పుస్తకాలతో పాటు మాన్యుస్క్రిప్ట్‌ల, అతిపెద్ద సేకరణలలో ఒకటిగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ గ్రంథాల‌యంలో 17 వేల మాన్యుస్క్రిప్ట్‌లతో పాటు 60 వేల పుస్తకాలు ఉన్నాయి.

అన్ని ర‌కాల భాష‌ల పుస్త‌కాలు..

ఈ గ్రంథాల‌యంలో ఉండే అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ఈ లైబ్రరీలో హిందీ, పాష్టో, సంస్కృతం, అరబిక్, పర్షియన్, తమిళం, టర్కిష్ భాషలతో పాటు ఇతర భాషల అరుదైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా పుస్తక సేకరణ కొనసాగుతూనే ఉండటం విశేషం. ఈ గ్రంథాలయంలో ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్ మొదట అనువాదించబడిన కాపీ కూడా ల‌భించ‌డం విశేషం. ఖురాన్‌ అసలు మాన్యుస్క్రిప్ట్‌లు ఈ గ్రంథాల‌యంలో ల‌భిస్తాయి.

ఈ గ్రంథాల‌య భ‌వ‌నం బంగారు రంగుతో ఉంటుంది...

ఈ గ్రంథాల‌యం నెల‌కొని ఉన్న‌ భవనం నవాబుల కాలం నాటిది. ఇక్క‌డి గ్యాలరీలో ఇటాలియన్ విగ్రహాలు, దర్బార్ హాలులో ఫ్రెస్కోలు ఉన్నాయి. ఈ గ్రంథాల‌యం వరల్డ్ ఫేమస్ అయితే, ఈ భవన నిర్మాణం అద్భుత కట్టడంగా, చారిత్రక ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ గ్రంథాల‌య భవనాన్ని బంగారు మెరుపు రంగుతో అలంకరించబడింది. ఈ భవనాన్ని 1905లో నిర్మించారు. అప్పట్లో దీన్ని గవర్నర్ జనరల్ లాటస్ ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ లైబ్రరీలో నాడు ఏర్పాటు చేసిన విద్యుత్‌ బల్బులు ఆన్ చేసినా..ఆఫ్ చేసినా బల్బులు కాలిపోకుండా సుమారు 115 ఏళ్ల నుంచి కాంతితో వెలుగునివ్వడం ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంతో ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+