Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ 5 నుండి 13 వరకు కొన‌సాగ‌నున్న స్ట్రాబెర్రీ ఫెస్టివల్..

ఏప్రిల్ 5 నుండి 13 వరకు కొన‌సాగ‌నున్న స్ట్రాబెర్రీ ఫెస్టివల్..

స్ట్రాబెర్రీ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. ఎరుపు రంగులో జ్యుసి జ్యుసిగా, కొద్దిగా పుల్లగా, తీపిగా నోరూరిస్తూ ఉంటుంది. కానీ, భార‌త్‌లో స్ట్రాబెర్రీల‌కు ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం ఉంద‌నేది ఎవ‌రికైనా తెలుసా? ఇక్క‌డ ప్ర‌త్యేకంగా స్ట్రాబెర్రీల కోసం ఓ పండుగ‌ను కూడా నిర్వ‌హిస్తారు. ఆ ప్ర‌దేశం ఏంటో ఎక్క‌డుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలకు మేఘాలయ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం. ఇక్క‌డ స్ట్రాబెర్రీల తోట‌లు అనేకం. మేఘాలయ నుండి జ్యుసి స్ట్రాబెర్రీలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మేఘాలయ సందర్శించే పర్యాటకులు కూడా స్ట్రాబెర్రీ తోటలను చూడటానికి ఎంతో ఆసక్తి క‌న‌బ‌రుస్తుంటారు. చాలామంది ప‌ర్యాట‌కులు కేవంల ఈ తోట‌ల‌ను చూసేందుకే ఇక్క‌డికి వ‌స్తుంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇక్క‌డ స్ట్రాబెర్రీ ఫెస్టివ‌ల్ కూడా నిర్వ‌హించ‌బ‌డుతుంది. అది కూడా ఏప్రిల్ మాసంలోనే.. ఆ వివ‌రాలేంటో చూద్దాం.

మేఘాలయ పచ్చని సుందరమైన లోయలు, ఎత్తైన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం దాని గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతకు కూడా పేరుగాంచింది. ఇది భారతదేశంలోని అత్యంత సుందరమైన రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది విభిన్నమైన జాతి సమూహాలను కూడా కలిగి ఉంది. వారు అనేక రకాల సాంస్కృతిక, మతపరమైన ఆచారాలను ముందుకు తెచ్చారు. మేఘాలయలోని ప్రసిద్ధిచెందిన‌ పండుగలు అనేకం ఉన్నాయి. అందులో ఒక‌టే స్ట్రాబెర్రీ ఫెస్టివల్.

thestrawberryfestival1

ఏప్రిల్ 13 వరకు ఫెస్టివ‌ల్‌...

ఈ ఫెస్టివ‌ల్ మేఘాలయలో నేటి నుండి అంటే ఏప్రిల్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవం ఏప్రిల్ 13 వరకు కొనసాగనుంది. మేఘాలయలో నిర్వ‌హించే ఈ స్ట్రాబెర్రీ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వ‌ర్వంలో జ‌రుగుతుంది. మేఘాలయలో ఈ పండుగను నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్రంలోని స్ట్రాబెర్రీల ప్రజాదరణను ఇతర రాష్ట్రాలకు మరియు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు..

స్ట్రాబెర్రీ ఫెస్టివల్ సందర్భంగా, దానిని పండించే రైతుల మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఇక్క‌డ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మేఘాలయలో మొక్కలపై పెరిగే ఈ ఎర్రటి జ్యుసి స్ట్రాబెర్రీలు ఇప్పుడు పండడం ప్రారంభించాయి మరియు చెట్ల నుండి వాటిని తీయడానికి సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల పర్యాటకులు మరింతగా ఆకర్షితులవుతారు.

స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తారు?

ఏప్రిల్ 5 నుంచి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సింటుంగ్ మరియు నోహ్రాన్ గ్రామాల్లోని స్ట్రాబెర్రీ తోటల దగ్గర నిర్వ‌హిస్తారు. రెభోయ్ జిల్లాలోని ఉకాతిహ్ మరియు సోహ్లియా, పశ్చిమాన బాల్డింగ్‌గ్రే, దరేచిక్‌గ్రే, దుర్కాంత్‌రాంగ్రే గ్రామాలు. గారో హిల్స్ జిల్లాలో ఉన్నాయి. ఇక‌, ఈ పండుగ సందర్భంగా ఇక్క‌డ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అందులో ముఖ్యంగా జానపద పాటలు మరియు సంగీతంపై నృత్యాలు, ఆహారం మరియు పానీయాలు మొదలైనవాటిని చేస్తుంటారు. వీటితో పాటు మొక్కల నుండి స్ట్రాబెర్రీలను తెంపడం, వైన్ మరియు జామ్ తయారీ మొదలైన వాటి గురించి కూడా సమాచారం ఇవ్వబడుతుంది.

ఎవరైనా పర్యాటకులు స్ట్రాబెర్రీ మొక్కలను చూడాలనుకున్న లేదా కొనాల‌నుకున్న అలాంటి వారు త‌ప్ప‌కుండా ఈ స్ట్రాబెర్రీ ఫెస్టివల్‌కి రావాల్సిందే. ఈ పండుగలో భాగంగా, ఇక్క‌డి కుటుంబాలు మరియు అతిథుల మధ్య తాజా స్ట్రాబెర్రీలు మరియు స్ట్రాబెర్రీ వైన్ వడ్డించ‌డం జ‌రుగుతుంది. ఈ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా పై-తినే పోటీలు మరియు కచేరీ పోటీలు వంటి అనేక వినోద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

More News

    Read more about: strawberry festival meghalaya
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+