మెట్రో రైలు ప్రయాణం ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే, తాజాగా దేశంలోనే మొదటి నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలులో ప్రయాణం చేసేందుకు.. ఆ రైడ్‌లో మీ అనుభవాలను సోషల్ నెట్‌వర్క్స్‌లో పంచుకునేందుకు సిద్ధమవ్వండి. మీరు విన్నది నిజమే నీటి అడుగున పరుగులు పెట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కత్తాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టెర్నల్ రెఢీ అయ్యింది. ప్రధాని నరెంద్రమోఢీ ప్రారంభించిన ఈ తొలి అండర్ వాటర్ మెట్రో టెర్నల్ ప్రత్యేకలు మీకోసం..
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారత్‌లోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోఢీ బుధవారం(మార్చి 6న) ప్రారంభించడంతోపాటు విద్యార్థులతో కలిసి ఈ మెట్రోలో ప్రయాణించారు. ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ఇందులో ప్రయాణించిన ప్రధాని, ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ముచ్చటించారు. అక్కడి ఇంజనీర్‌లు అండర్ వాటర్ రైలు విశేషాలను వివరించారు.

తొలి మెట్రో సేవలు మొదలైన చోటే..
దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు పరుగులు పెట్టిన కోల్‌కతాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1984లో దేశంలో తొలిసారి మెట్రో సేవలు మొదలైంది కూడా ఈ మహానగరంలోనే. ఇప్పుడు నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ కోల్‌కతా నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుందనే చెప్పాలి. కోల్‌కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.
120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది కిందనుంచి ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ కోల్‌కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో మార్గం 16.6 కిలోమీటర్లు ఉండగా.. ఇందులో 10.8 కిలోమీటర్ల దూరం భూగర్భంలో ఉంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన ఈ అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ ఏర్పాటు చేశారు.

7 లక్షల మంది వరకూ ప్రయాణిస్తారని అంచనా..
ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్ల లోపల, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. నదిలోని టన్నెల్‌ను 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి, ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లోనే పునాది పడగా, అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో పట్టాలెక్కించారు.
ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గుతుంది. నీటి అడుగున నిర్మించిన ఈ మెట్రో రైలులో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది వరకూ ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనాలు వేస్తున్నారు.



Click it and Unblock the Notifications













