Search
  • Follow NativePlanet
Share
» »మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ ఆల‌యంలో విగ్ర‌హం లేదు... పూజారి ఉండ‌డు...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ ఆల‌యంలో విగ్ర‌హం లేదు... పూజారి ఉండ‌డు...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ ఆల‌యంలో విగ్ర‌హం లేదు... పూజారి ఉండ‌డు...

ఆధ్యాత్మికతకు నిల‌యం భార‌త‌దేశం. ఎందుకంటే, ఇక్క‌డ అడుగడుగునా దేవాల‌యాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. భారతదేశం అంటారు. మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆచారాలు, సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆయా ప్రదేశంలో ఉన్న ఆలయాలకు ఎన్నో మహిమలు ఉన్నాయని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల న‌మ్మ‌కం. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు మ‌నం చూస్తాం. కానీ భార‌త‌దేశంలో విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్నింటిని మాత్రమే చూడగలం. అందులో కొన్ని రెండువేల‌ సంవత్సరాలకు పైగా పురాతనమైన దేవాల‌యాలు ఉండ‌డం కూడా విశేషం. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ ఆల‌యంలో విగ్ర‌హం లేదు.. పూజారి ఉండ‌డు. అయినా కానీ, నిత్యం వేలాదిగా భ‌క్తులు తండోప‌తండాలుగా త‌రలివ‌స్తుంటారు. రండి ఆ ఆల‌యం గురించి తెలుసుకుందాం.

sagajboujitemple,How to reach this temple in Madhya Pradesh, Specialties of this temple

గ‌డియారాన్ని ఇవ్వ‌డం ఆన‌వాయితీ...

మధ్య ప్రదేశ్ లోని చిర్మోలియా గ్రామంలో ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు వేలాది మంది భ‌క్తులు సుదూర ప్రాంతాల‌నుండి ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు. అయితే ఈ ఆల‌యంలో విగ్ర‌హం లేదు. పూజారి ఉండడు. అయినా ఈ ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఎంతో మ‌హిమ గ‌ల ఆల‌యం అని భ‌క్తులు న‌మ్ముతున్నారు. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు ఈ ఆలయానికి ఒక గడియారాన్ని అందజేస్తారు. ఈ ఆల‌య ప్రాముఖ్య‌త ఏమింటే.. ఈ ఆలయంలో ఏ దేవుడు లేడు. పండితుడు లేడు. అయినప్పటికీ ఈ ఆలయం వేలాది మంది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిందని చెప్పుకోవాలి. ఈ ఆలయంలో ఎవరైనా కోరికలు కోరితే ఆ కోరిక త‌ప్ప‌కుండా నెర‌వేరుతుంద‌ట‌. కోరిక నెర‌వేరిన భ‌క్తులు ఈ ఆలయానికి ఒక గడియారాన్ని సమర్పిస్తారని ఇక్క‌డి స్థానికులు చెబుతున్నారు. ఈ ఆల‌యంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ సంప్ర‌దాయం కొనసాగుతోంది.

sagajboujitemple , No priest in this temple in Madhya Pradesh

ఈ ఆల‌య చరిత్ర ఏన్నో యేళ్ల నాటిది..

ఈ ఆల‌యం చిర్మోలియా గ్రామం మందసౌర్‌లోని సగజ్ బౌజీ దేవాలయంగా పేరుగాంచింది. ఈ ఆల‌యం గురించి ప్ర‌జ‌ల్లో ఒక గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. ఏదైనా చెడు జరిగినప్పుడు, ఇక్కడకు వచ్చి అగరబత్తులు వెలిగించి కోరికలు తీర్చుకుంటే అది నెరవేరుతుందని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. వారు కోరిన కోరిక‌లు నెర‌వేరిన‌ప్పుడు భ‌క్తులు గడియారాన్ని అంద‌జేస్తారు. ఈ ఆలయంలో సమర్పించే వేలాది గ‌డియారాలను సంవత్సరానికి ఒకసారి నదిలో వేయ‌డం జరుగుతుంది. ఈ ఆల‌యానికున్న ఇంకో విశిష్ట‌త ఏంటటే, ఇప్పటి వరకు ఈ ఆలయానికి ఏవిధమైనా తాళం లేదు. అయితే ఇక్కడ సమర్పించే గడియారాలను ఎవరూ దొంగిలించరు కూడా. ఈ ఆల‌య చ‌రిత్ర ఎన్నో ఏళ్ల నాటిద‌ని ఇక్క‌డివారు చెబుతున్నారు.

sagajboujitemple , No idol in this temple in Madhya Pradesh

మొబైల్ ఫోన్‌తో మొద‌లైన సంప్ర‌దాయం...

స‌గజ్ బౌజీ అనే గురువు ఈ ఆల‌యంలో ఉన్న చెట్టుకింద విశ్రాంతి తీసుకునేవాడట. ఇప్పుడు ఇక్క‌డే గుడిని నిర్మించారు. కోరిక తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చిన వారు, కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ గడియారాన్నిత‌ప్ప‌కుండా అంద‌జేస్తారు. గడియారాన్ని అందించే సంప్రదాయం మొబైల్ ఫోన్ కోల్పోవడం నుంచి మొద‌ల‌య్యిందట‌. సుమారు ప‌దిహేనేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణించాడ‌ని, ఆ సమయంలో అతని మొబైల్ పోయింది. చెట్టుకింద ఉన్న సగజ్ బౌజీ స్థలంలో అగరబత్తీలు పెట్టి, తన మొబైల్ దొరికితే వాచ్ ఇక్కడే అందజేస్తానని ప్రమాణం చేశాడు. అలా కొంతకాలం తర్వాత, అతను పోగొట్టుకున్న మొబైల్ దొరికిందంట, అప్పటి నుండి ఇక్కడ వాచ్ అందించే సంప్రదాయం ప్రారంభమైద‌ని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+