రోడ్ ప్రయాణం రోడ్ ప్రయాణం లో నుబ్రా వాలీ చేరాలనుకునే వారు మొదట లెహ్ సందర్సించాలి, లెహ్ నుండి బస్సు సౌకర్యం కలదు. స్థానిక జీప్ లు కూడా నుబ్రా వాలీ చేరతాయి లేదా స్వంత కారు, లో ప్రయాణించ వచ్చు. అయితే కొండ వంపులు కొంచెం కష్టతరం అనిపిస్తాయి నవంబర్ నుండి మే వరకు వచ్చే ప్రయాణికులకు నుబ్రా వాలీ చేరేందుకు మంగళ , గురు, శని వారాల లో ఉదయం పూట అనుమతి వుంటుంది. ఇలా వెళితే వారు బుధ, శుక్ర మరియు ఆది వారాలలో వరుసగా తిరిగి వస్తారు. సోమవారాలు రోడ్ రిపేర్ లకు గాని మూసివేస్తారు. నుబ్రా వాలీ వెళ్లేందుకు ఉదయం 10 గం. వరకు మాత్రం వుంటుంది. తిరిగి వచ్చే వారికి సా. 6 గంటల వరకు అనుమతి వుంటుంది.