నుహ్ వాతావరణం నుహ్ పట్టణంలో వేడి వేసవికాలం, చల్లని శీతాకాలాల తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అన్ని సీజన్లలో కంటే, ఆహ్లాదకర వాతావరణం ఉండే సెప్టెంబర్, నవంబర్ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.
వేసవి నుహ్ లో వేసవి మార్చ్ నెల చివరి నుండి మే చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రత షుమారు 38 డిగ్రీలు ఉండి చాలా వేడిగా ఉంటుంది. సంవత్సరం మొత్తంలో మే నెల అత్యంత వేడిగా ఉండే మాసం.
వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. సంవత్సరంలో జులై, ఆగస్ట్ నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణం కష్టంగా ఉండి, వివిధ ప్రదేశాలు సందర్శించడానికి అనువుగా ఉండదు. ఈ సమయంలో వర్షాలు వేసవి తాపం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, సంవత్సరం మొత్తం మీద డిసెంబర్ నెల చాలా చల్లగా ఉంటుంది.