నూర్పూర్ కోట, 10వ శతాబ్దంలో నిర్మించిన నూర్పూర్లోని ఒక ప్రఖ్యాత ఆకర్షణ. ఈ కోటను ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పఠానియా వంశస్థులు నిర్మించారు. ఈ కోట నుండి చిన్న చక్కి నది, ఉప నది జభార్ ఖుడ్ మంత్రముగ్ధ దృశ్యాలను చూడవచ్చు. పర్యాటకులు కోట గోడలపై చిత్రాల ఆనవాలును కూడా చూసి ఆనందించవచ్చు. కోట ఈశాన్య దిక్కున చెక్కిన జంతువుల చిత్రాలు ఎంతో ఆసక్తిని కల్గిస్తాయి. దీనితోబాటుగా, పురుషులు, స్త్రీలు, పిల్లలు, రాజులు, దేవుళ్ళు, దేవతలు, పక్షుల చిత్రాలను కూడా పర్యాటకులు చూడవచ్చు.
కోటలోపల కృష్ణ భగవానునికి చెందిన బ్రిజ్ మహారాజు ఆలయాన్ని చూడవచ్చు. జగత్ సింగ్ రాజు కాలంలో రాజస్థాన్ నుండి అద్భుతమైన ఈ నల్లరాయి విగ్రహాన్ని తీసుకొని వచ్చారు. క్రీ.శ. 1905 లో ఈ ప్రాంతంలో వచ్చిన తీవ్ర భూకంపం వలన ఈ కోట ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. పైగా, బ్రిటిష్ వారు కూడా ఈ కోటలో కొంత భాగాన్ని నాశనం చేసారు, అయినా ఈ చిన్న కోట లోని మిగిలిన కొన్ని భాగాలు పర్యాటకులు ఒక సారి తప్పకుండా చూడదగినవి.



Click it and Unblock the Notifications