Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పురాతన గోవా » ఆకర్షణలు » బేసిలికా ఆఫ్ బామ్ జీసస్

బేసిలికా ఆఫ్ బామ్ జీసస్, పురాతన గోవా

5

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కు ఇది స్వంత పట్టణం, ఈ ఫాదర్ క్రైస్తవమతాన్ని ఈ ప్రాంతానికి తీసుకు వచ్చాడు. గోవాలోని ఈ చర్చి  వేలాది పర్యాటకులను, యాత్రికులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఇక్కడకు వచ్చే వారిలో కేధలిక్ లు మరియు కేధలిక్ కాని వారు కూడా ఉంటారు. చర్చికి చాలా మహిమ కలదని ప్రత్యేకించి మహిమాన్వితుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రోగాలను, వ్యాధులను నివారించటంలో ఎంతో గొప్పవాడని విశ్వసిస్తారు. ఆయన మరణించినప్పటికి ఆయన నిర్మించిన చర్చి మహిమలకు ఆకర్షితులవుతారు.. ఈ సెయింట్ మృత దేహాన్ని ప్రతి పది సంవత్సరాలకు ప్రజలకు చూపుతారు. చివరి సారిగా 2004లో ఈ ప్రదర్శన జరిగింది.  బామ్ జీసస్ అంటే మంచి జీసస్ లేదా ఉన్ ఫాంట్ జీసస్ అని చెపుతారు.    చరిత్రబాసిలికా ఆఫ్ బామ్ జీసస్ సుమారు 400 సంవత్సరాల పురాతనమైంది. దీనిని ఫాదర్ అలీక్సో డి మెంజీస్ 1605 లో నిర్మించారు. చర్చి లోపల యాత్రికులు  ప్రార్ధనలు చేయవచ్చు. అక్కడి కళా నైపుణ్యతలను చూసి ఆనందించవచ్చు. చర్చి లోని శిల్ప సంపదలు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జీవితం, ఆ నాటి క్రైస్తవ మత అంశాల గురించిన ఎన్నో వివరాలను అందిస్తాయి. నేటికి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అస్తికలను ఒక విలువైన పేటికలో భధ్రపరచారు. ఈ చర్చిలోని శిల్పనైపుణ్యత చాలావరకు 17వ శతాబ్దానికి చెందిన జియోవన్ని బాట్టిస్తా చే రూపొందించబడింది. చర్చి నిర్మాణం పూర్తిగా జెస్సూట్ మత  శిల్ప సిద్ధాంతలపై ఆధారపడి చేయబడింది.    యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించబడి, 400 సంవత్సరాల చరిత్ర కల ఈ చర్చిని త్వరలో పునరుద్ధరిస్తున్నట్లు కూడా చెపుతున్నారు. దీనికి గల ప్రస్తుత యాస్బెస్టాస్ షీటు సీలింగ్ ను తొలగించి దాని స్ధానంలో గాల్వనైజు ఐరన్ షీటు వేసి చర్చిని అద్భుత పర్యాటక స్ధలంగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్చి ఆవరణలోనే మరో చిన్న నిర్మాణం కలదు. దీనిని చర్చి కంటే ముందుగానే నిర్మించారు. సుమారు 1585 సంవత్సరంలో అంటే చర్చికి 20 సంవత్సరాల ముందు దీని నిర్మాణం జరిగింది. జెస్సూట్ మత స్ధాపకులు వారి మత ప్రచారం కొరకు చర్చికంటే ముందుగా దీనిని నిర్మించుకున్నారు.. అయితే జెస్సూట్లకు సెనేట్ చర్చి నిర్మాణానికి అనుమతినివ్వలేదు. ఇక ఆ సమయంలో జెస్సూట్లు, రాత్రికి రాత్రే అతి త్వరగా చిన్న సైజు చర్చిని నిర్మించి దాని ప్రారంభోత్సవానికి సెనేట్ లోని కామనర్లను ఆహ్వానించారు. ఇక ఆ సమయంలో కామనర్లు చేసేదేమీ లేక దానికి అంగీకరించి చర్చి పూర్తిగా నిర్మించేలా చేశారు. చర్చి ఆవరణలోనే కల ఈ చిన్న నిర్మాణాన్ని ప్రొఫెస్డ్ హౌస్ అని పిలుస్తారు.  అక్కడకు ఎలా చేరాలి?  బామ్ జీసస్ బేసిలికా గోవాలో రాజధాని పనాజిం సమీపంలోనే ఉంటుంది. ఈ ప్రదేశానికి చేరాలనుకునేవారు  పట్టణం నుండి క్యాబ్ లే చేరవచ్చు లేదా వాస్కోడా గామా లేదా మార్గోవా లనుండి కూడా తేలికగా చేరుకోవచ్చు. నార్త్ గోవాలో బస చేసిన యాత్రికులు అంటే బాగా, కాలన్ గూటే, కండోలిం ప్రాంతాలలోని వారు ఆ ప్రాంతాలలోని చర్చిల సందర్శనలతో పాటు, అధిక సమయం వెచ్చించకుండానే స్వంత వాహనం లేదా అద్దెకు తీసుకున్న వాహనాలలో ఈ చర్చిని సందర్శించుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Oct,Thu
Return On
23 Oct,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Oct,Thu
Check Out
23 Oct,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Oct,Thu
Return On
23 Oct,Fri
 • Today
  Old Goa
  28 OC
  82 OF
  UV Index: 7
  Partly cloudy
 • Tomorrow
  Old Goa
  27 OC
  80 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Old Goa
  27 OC
  81 OF
  UV Index: 6
  Light rain shower

Near by City