పురాతన గోవా - చారిత్రక వారసత్వం!

పనాజి నగరానికి ఉత్తరాన సుమారు 10 కి.మీ.ల ప్రదేశం పాత గోవాగా పిలుస్తారు. పోర్చుగీసు పాలనలో ఇది గోవాకు రాజధానిగా ఉండేది. చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. స్ధానిక భాషలో వెల్హా గోవా అని పిలుస్తారు. దీనిని 15వ శతాబ్దిలో బీజపూర్ పాలకులు నిర్మించారు. కాలక్రమేణా పోర్చుగీసు పాలకుల చేతిలోకి వచ్చింది.

ఈ పురాతన గోవా ఒకప్పుడు అధిక సంఖ్య ప్రజలతో ఉండేది. అయితే, అక్కడ ప్రబలిన కొన్ని అంటు వ్యాధుల కారణంగా జన సంఖ్య బాగా తగ్గిపోయింది. వారందరూ షుమారు 17వ శతాబ్దిలో బయటకు తరలి వెళ్ళారు. అప్పటి నుండి దానిని వెల్హా గోవాగా చెపుతారు. అదే పాణజిం, నోవా గోవా. పురాతన గోవాలో ఆకర్షణ అంటే చర్చిలు మాత్రమే. ది చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి అనేది పోర్చుగీసు పాలకులు సుమారు 17వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో సెయింట్ మైకేల్ విగ్రహం ఉంటుంది.  ఈ చర్చిలో అలంక్రిత స్తంభాలనుండి సెంట్ పీటర్ మరియు సెయింట్ పౌల్ విగ్రహాలవరకు ఎంతో అందంగా కనపడతాయి. అంతర్జాతీయ ప్రదేశాలైన సెయింట్ పీటర్స్ బర్గ్ చర్చి లలో వలే కనపడతాయి. వెల్హా గోవా నిస్సందేహంగా మతపర విలువలు కలిగినదే. ఆధ్యాత్మికతలు నచ్చని వారు వెల్హారా గోవా సందర్శన నిలుపుకోనవసరం లేదు.

వీరికి అనేక ఇతర వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వారు కారంబోలిం సరస్సు, అక్కడకు వచ్చే వలస పక్షులను ఆనందించవచ్చు. ఎన్నో రకాల పక్షులు వివిధ రంగులలో మీకు కన్నులకు విందు చేస్తాయి. దశాబ్దాలనుండి అవి ఆ ప్రదేశాలకు వలసలు వస్తూంటాయి. కారంబోలిం సరస్సు కార్మాలి రైలు స్టేషన్ కు దగ్గర. 16వ శతాబ్దంలో, పోర్చుగీసు పాలకులు తమ క్రైస్తవ మత ప్రచారాలను ఇక్కడ మొదలుపెట్టారు. డైవర్ ద్వీపంలో ప్రసిద్ధ హిందూ దేవాలయాలు కలవు. దురదృష్టవశాత్తూ క్రైస్తవమతం అధికంగా ఉండటంతో హిందూ మతం ఈ ప్రాంతంలో వెనుకబడింది.

అయినప్పటికి డైవర్ ద్వీపం ప్రకృతి అందాలకు, పచ్చని పొలాలకు పేరు గాంచింది. ఈ ద్వీపం పనాజికి బోటు మార్గంలో కలుపబడింది. ఈ ద్వీపాన్ని బొండేరం లేదా పోటేకర్ పండుగలలో సందర్శించాలి. ఆ సమయంలో చక్కటి సంగీతాలు, పేరేడ్లు, రంగు రంగుల దుస్తుల ప్రజలు కనపడతారు.

సముద్ర మార్గాలు కనిపెట్టిన వాస్కోడ గామా విజయాలకు చిహ్నంగా 16వ శతాబ్దంలో నిర్మించిన వైస్ రాయ్ ఆర్చి కట్టడాన్ని తప్పక చూడాలి. ఇది పురాతన గోవాకు గేట్ వేగా ఉంటుంది.   పురాతన గోవా చేరటం తేలికే. క్యాబ్ లు లేదా రిక్షాలు లభ్యంగా ఉంటాయి. అయితే, మీరు కనుక ఒక బైక్ వంటిది కలిగి ఉంటే, పురాతన గోవాలోని ఆసక్తికల వివిధ రకాల నిర్మాణాలను సందర్శించవచ్చు.

Please Wait while comments are loading...