Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఊటీ » వాతావరణం

ఊటీ వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్, మార్చ్, ఏప్రిల్ మాసాలు ఊటీ సందర్శనకు అనువైనవి. ఈ సమయంలో, ఉష్ణోగ్రత 25 డిగ్రీల స్థాయిలో వుంటుంది. స్థల సందర్శనకు అదే విధంగా స్థానిక ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ మూడునెలలో రాత్రులు సౌకర్యవ౦త౦గా కూడా ఉంటాయి,అయితే రాత్రులందు చల్లదనాన్నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వారివద్ద ఎక్కువ ఊలుదుస్తులు ఉంచుకోవలసిన అవసరం కలదు.

వేసవి

వేసవి ఊటీ లో వేసవి మార్చ్ చివర నుండి ప్రారంభమై మే మొదటి వారం వరకు ఉంటుంది. అయితే, వేసవి దక్షిణ భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల వలే కాకుండా వేడిగా, ఆర్ద్రంగా ఉండవు. వేసవిలో ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి ఉండదు. మీరు బైటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే, కాలం ఆధారంగా పగలు కొంచెం వేడి ఉంటుంది, కానీ రాత్రులు ఖచ్చితంగా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఊటీలో వర్షాకాలం మే మొదటి వారంలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షాకాలంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు పడిపోతుంది. ఈ పర్వత ప్రాంతంలో ఉండే అధిక వర్షపాతం అసౌకర్యం కలిగిస్తుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఊటీ చాలా చల్లగా, పొడిగా ఉంటుంది. వెచ్చటి దుస్తులు ధరించకుండా రోజంతా వుండే ఈదురు గాలుల వల్ల ఇంటినుండి బైటికి వెళ్ళడం కష్టమౌతుంది. శీతాకాలాలు అక్టోబర్ తో ప్రారంభమై అతిచల్లని జనవరి నెలతో పాటు ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత రాత్రులందు 4 డిగ్రీలకు పడిపోతుంది.