బేతాబ్ లోయ ప్రక్రుతి సౌందర్యానికి ఆటపట్టు. దీనికి హిందీ సినిమా 'బేతాబ్' తరువాత ఈ పేరు వొచ్చింది. ఈ సినిమాలో చాల దృశ్యాలు ఇక్కడే తీశారు. ఇది పహల్గాం నుండి 7 కి. మీ దూరంలో ఉన్నది. దీనిని శెషనాగ్ నది యొక్క నోరు అని కూడా అంటారు. మంచుతో కప్పబడిన కొండలు, గంధపు చెట్ల అడవులు,స్వచ్చమైన సెలయేళ్ళు, నులివెచ్చని సూర్యుని వేడి, తీగల చెట్లు ఈ ప్రదేశం యొక్క ఆకర్షణలు. దీనికి సమీపంలో ఉన్న బైసరన్ మరియు తులియన్ సరస్సులు, ఈ సరస్సులు పహల్గామ్ నుండి తక్కువ దూరంలో ఉండటం వలన దర్శనా స్థలంగా పేరు పొందింది. దీనికి తోడు, పహల్గామ్ డెవలప్మెంట్ ఆథారిటి ఈ స్థలాన్ని అభివృద్ధి పరుస్తూ బహుళ ప్రాచుర్యాన్ని తెస్తున్నారు.



Click it and Unblock the Notifications