Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోర్ట్ బ్లెయిర్ » ఆకర్షణలు » జాలీ బాయ్

జాలీ బాయ్, పోర్ట్ బ్లెయిర్

1

జాలీ బాయ్ దీవి పోర్ట్ బ్లెయిర్  ఓడరేవుకు సమీపంలో కలదు. చాలామంది పర్యాటకులు చెప్పినట్లు భూమిపై కల స్వర్గంలా ఉంటుంది. ఇది మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉండి వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ గా పిలువబడుతుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు అధిక ఆనందాన్నిస్తుంది.. అక్కడకల పగడపు మరియు అందమైన తెల్లని మరియు పచ్చటి బీచ్ లతో వ్యక్తిగత బంధం ఏర్పరుస్తుంది. కొన్ని మార్లు ఒకటి లేదా రెండా డాల్ఫిన్ లను కూడా చూసే అదృష్టం కలుగవచ్చు.

మెరైన్ నేషనల్ పార్క్ స్ధాపనను అటవీ శాఖ అండమాన్ మరియు నికోబార్ దీవులలోని వన్య సంపదను రక్షించేందుకు స్ధాపించింది. ఈ మెరైన్ పార్క్ చుట్టూ సుమారు 150 దీవులు 280 చ.కి.మీ.ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. వాటిలో జాలీ బాయ్ దీవి అత్యుత్తమ దీవిగా రేటింగ్ ఇవ్వబడింది.

జాలీబాయ్ దీవికి వెళ్ళటమే ఒక మరచిపోలేని అనుభవం. ఈ దీవికి వెళ్ళాలంటే అటవీ శాఖ అనుమతి కావాలి. ఫెర్రీ ప్రయాణానికి టికెట్లు కొనాలి. ఈటికెట్ కు రూ. 50 మరియు అనుమతి కి రూ.550 అవుతాయి. అయినప్పటికి మీ ఖర్చుకు తగ్గ ఆనందం లభిస్తుంది. ఫెర్రీ ప్రయాణం పోర్ట్ బ్లెయిర్ వద్ద మొదలవుతుంది. మీ వెంట గైడ్ లు ఉండి వివరిస్తూ అందమైన ప్రదేశాలు చూపుతూ అనేక శబ్దాలు, జలచరాలను చూపుతూ ప్రయాణింపజేస్తారు..

జాలీ బాయ్ దీవి చేరే సమయంలో పర్యాటకులను గ్లాసు అడుగు కల చిన్న చిన్న బోట్లలోకి చేరుస్తారు. ఈ గ్లాసు ద్వారా పర్యాటకులు పగడపు రాళ్ళను సముద్రంలో దీవి చేరుతున్న సమయంలో అడుగున చూడవచ్చు.

జాలీ బాయ్ దీవి లో నిబంధనలు అధికం. అక్కడకు పర్యాటకులు తమ స్వంత ఆహారం నీరు తీసుకు వెళ్ళటానికి లేదు. పోర్ట్ బ్లెయిర్ వద్ద భారత ప్రభుత్వం ఇచ్చే ఆహారం, నీరు మాత్రమే తీసుకు వెళ్ళాలి. ఇక జాలీ బాయ్ బీచ్ చేరితే చాలు మీకు అందమైన బీచ్ లు, పరిశుభ్రమైన ష్యాక్ లు కల్తీ లేని పరిసరాలు అక్కడ కనపడతాయి.

జాలీ బాయ్ లో ఒక మధ్యాహ్నం వేళ సూర్య రశ్మి మరియు ఇసుక తిన్నెల మధ్య మీకు ఇష్టమైన హనీమూన్ సైతం గడిపేయవచ్చు.

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu

Near by City