భుబనేశ్వర్ నుండి 61 కిలోమీటర్ల దూరం లో ప్రాచి వాలీ ఉంది. పురాతత్వ శాస్త్రం పై ఆసక్తి కనబరచేవారికి అలాగే చరిత్రపై ఇష్టం ఉన్నవారికి ప్రాచి వాలీ పర్యటన ఆహ్లాదాన్నిస్తుంది. మహానది యొక్క తృతీయ నది అయిన ప్రాచి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం లో 7 వ శతాబ్దం నుండి 15 వ శతాబ్దానికి చెందిన అనేక రకమైన స్మారక చిహ్నాలు కనబడతాయి.
ప్రాచి మరియు లలిత నది సంగమం వద్ద ఉన్న చాహతా అనేది అద్భుతమైన ప్రాంతం. ఇతిహాసాల ప్రకారం భగవాన్ విష్ణువు, గంగ ని ఇక్కడే ఈ నదీ సంగమం లో మునగమన్నాడు. లలితా మాధవ గా స్థాపించబడిన విష్ణువు ప్రతిమ ని ఇక్కడ గమనించవచ్చు.
ప్రాచి లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు
ఎన్నో పురాతన ఆలయాలకు ప్రాచి వాలీ స్థావరం. రామాయణ మరియు మహాభారత ఇతిహాసాలకు ఇది సంబంధం ఉన్న ప్రదేశం ఇది. అమరేశ్వర లో ఉన్న శివుడి ఆలయానికి రామాయణం తో చక్కటి అనుబంధం ఉంది. వీటితో పాటు, శోభనేశ్వర ఆలయం, చాముండ దేవి ఆలయం అలాగే గ్రామేశ్వర ఆలయం లు ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు. ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి.
ఈ ఆలయాల సమీపం లో ఉన్న ప్రాచి, సరస్వతి ఇంకా మణికర్ణిక నదుల సంగమం 'మణికర్ణిక తీర్థ' గా ప్రసిద్ది. 'అమావాస్య' రోజున ఈ పవిత్రమైన జలం లో స్నానమాచరించడం కోసం వేల మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. వివిధ దేవుళ్ళకు అంకితమివ్వబడిన వివిధ ఆలయాలు విభిన్న సంస్కృతులకు ప్రతీకలు. ప్రాచీ వాలీ పర్యాటకం కి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.
అనువైన సమయం
శీతాకాలం ప్రాచీ వాలీ సందర్శనకు అనువైన సమయం.
ఎలా చేరాలి
భుబనేశ్వర్ కి ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా చేరుకొని అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ప్రాచి కి చేరుకోవాలి. ప్రాచి వాలీ పర్యటన కు శీతాకాలం అనువైన సమయం.



Click it and Unblock the Notifications