ప్రాచి వాలీ వాతావరణం ప్రాచి వాలీ ని సందర్శించేందుకు శీతాకాలం ఉత్తమ సమయం. ఈ సమయం లో పగటి ఉష్ణోగ్రత చల్లగా రాత్రి ఉష్ణోగ్రత విపరీతమైన చలిగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా జనాలు చలి మంటలు కాచుకుంటూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ సమయం లో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు.
ఎండాకాలం ఎండాకాలం కేవలం మూడు నెలల వరకే ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ మరియు మే నెలలలో ఇక్కడి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ సమయం లో ప్రాచి వాలీ సందర్శన కొంచెం క్లిష్టం గా ఉంటుంది. ఎక్కువగా చెమట పట్టి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.
వర్షాకాలం వర్షాకాలం ఇక్కడ ఎక్కువ కాలం ఉంటుంది. జూన్ లో మొదలయ్యే వర్షాకాలం అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. అత్యధిక వర్షపాతం ఈ సమయం లో తరచూ నమోదవుతుంది. అందువల్ల ఈ సమయం లో ప్రాచీ వాలీ సందర్శన అనువైనది కాదు.
శీతాకాలం ఇక్కడ శీతాకాలం తక్కువ సమయం. అంటే కేవలం మూడు నెలల కాలం మాత్రమే ఉంటుంది. డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు ఇక్కడ శీతకాలం. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటుంది. ఈ ప్రాంత సందర్శనకు ఈ సమయం అనువైనది. తగినన్ని వెచ్చని దుస్తులతో పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలి.