షేక్ ఉల్ ఆలం ఎయిర్ పోర్ట్ గా పిలువబడే శ్రీనగర్ విమానాశ్రయం, పుల్వామా దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్. ఇది ఢిల్లీ, ముంబై, చండీగఢ్, మరియు సిమ్లా వంటి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలకు అనుసంధానించబడింది. యాత్రికులు పుల్వామా పట్టణంను చేరుకోవడానికి విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ కి 876 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.